Venkateswarlu
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ రేవంత్ రెడ్డి బయోపిక్ తీస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ రేవంత్ రెడ్డి బయోపిక్ తీస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Venkateswarlu
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ‘బండ్ల గణేష్’ రేవంత్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఒప్పుకుంటే ఆయన బయోపిక్ చేస్తానని అన్నారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘రేవంత్ అన్న ఒప్పుకుంటే అతని జీవిత చరిత్రను సినిమా రూపంలో చిత్రీకరిస్తాను. రేవంత్ రెడ్డికి ఎంతో మంది శత్రువులు ఉన్నారు. ఆయనను జైల్లో ఉంచి ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. ఇబ్బందులు పడిన చోటనే ఆయన నిలదొక్కుకుని ఈ రోజు నాయకుడిగా అధికారాన్ని సంపాదించుకున్నారు.
రేవంత్‌కు ఆకలి విలువ, కసి, కష్టం, పరిపాలన ఇలా అన్ని తెలుసు’’ అని అన్నారు. ప్రస్తుతం బండ్ల గణేష్ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. సోషల్ మీడియాలో రేవంత్ అభిమానులు పెద్ద చర్చ చేస్తున్నారు. రేవంత్ బయోపిక్ తీస్తే.. అది పాన్ ఇండియా లెవెల్‌లో ఉండాలని అంటున్నారు. బండ్ల గణేష్‌కు రేవంత్ రెడ్డి అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీ గెలుపును ఆస్వాదిస్తున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ మాట్లాడుతూ.. తన అభిమాన నాయకుడు ప్రమాణ స్వీకారం చేయడం చూడడానికి.. ముందురోజే స్టేడియంకి వెళ్లి పడుకుంటానని అన్నారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇదే ఉత్సాహంతో బండ్ల గణేష్ రీసెంట్ గా ఓ డెబిట్ లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి బయోపిక్‌పై సంచలన ప్రకటన చేశారు.
కాగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని బండ్ల గణేష్ ముందుగానే చాలా నమ్మకంగా చెప్పారు. కానీ హైదరాబాద్‌లో ఒక్క స్థానం కూడా రాకపోవడం బాధాకరమని.. వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్‌లోనూ కాంగ్రెస్ జెండా ఎగురుతుందని.. కాంగ్రెస్ పాలన అద్భుతంగా ఉండబోతుందని .. బండ్ల గణేష్ పేర్కొన్నారు. ఆయన అన్నట్లుగానే కాంగ్రెస్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. దాదాపు 65 స్థానాల్లో విజయ బావుటా ఎగురవేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఏదేమైనా ఒక సాధారణ విద్యార్థి నుంచి ఎన్నో అవమానాలను.. ఆటుపోట్లను ఎదుర్కొంటూ.. పడి లేచిన కెరటంలా రేవంత్ రెడ్డి ఈ రోజున తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. అటువంటి ఓ వ్యక్తి కథను సినిమా రూపంలో చిత్రీకరించాలి అనుకోవడం విశేషం. రేవంత్ రెడ్డి నిజ జీవిత గాధ ఒక సినిమా స్టోరీ కి కచ్చింతగా సరిపోతుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరి, బండ్ల గణేష్ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి బయోపిక్ ను చిత్రీకరిస్తానని అనడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.