iDreamPost
android-app
ios-app

23 ఏళ్ళ తర్వాత నెగిటివ్ బాలయ్య

  • Published Apr 27, 2022 | 4:57 PM Updated Updated Apr 27, 2022 | 4:57 PM
  • Published Apr 27, 2022 | 4:57 PMUpdated Apr 27, 2022 | 4:57 PM
23 ఏళ్ళ తర్వాత నెగిటివ్ బాలయ్య

నందమూరి బాలకృష్ణ దర్శకుడు గోపిచంద్ మలినేని కాంబోలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. మధ్యలో చిన్న చిన్న బ్రేకులు వచ్చినప్పటికీ అనుకున్న టైం ప్రకారం షెడ్యూల్స్ వేసి పూర్తి చేస్తున్నారు. ఈ ఏడాదే విడుదల చేసేలా ప్లానింగ్ ఉంది కానీ ఏ సీజన్ ని టార్గెట్ చేశారో వేచి చూడాలి. లేటెస్ట్ లీక్ ఒకటి బాలయ్య ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చేలా ఉంది. దాని ప్రకారం ఇందులో హీరో క్యారెక్టర్ డ్యూయల్ రోలట. ఒకటి నెగటివ్ షేడ్స్ లో ఉంటుందని తెలిసింది. పేరుకు అలా చెప్పినా కూడా పవర్ ఫుల్ ఎలివేషన్లతో ఫ్యాన్స్ కి ఇదే నచ్చేలా ఓ రేంజ్ లో డిజైన్ చేశారట గోపిచంద్.

ఇంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ గతంలో బాలయ్య 1999లో వచ్చిన సుల్తాన్ లో చేశారు. అందులోనూ ద్విపాత్రాభినయమే. ఇటీవలే కన్నుమూసిన శరత్ డైరెక్షన్ లో రూపొందింది. కాకపోతే అప్పట్లో సమరసింహారెడ్డి లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన మూవీ కావడంతో సుల్తాన్ గా బాలయ్యని ఆశించిన రేంజ్ లో రిసీవ్ చేసుకోలేకపోయారు. కానీ పెర్ఫార్మన్స్ మాత్రం పీక్స్ లో ఉంటుంది. మళ్ళీ 23 ఏళ్ళ తర్వాత అలాంటి పాత్ర చేయనుండటం విశేషం. ఇందులోనే వరలక్ష్మి శరత్ కుమార్ బాలకృష్ణకు చెల్లెలిగా నటిస్తున్నట్టు తెలిసింది. కాకపోతే ఏ వైపు ఉంటుందన్నది ఇంకా తెలియదు. మొత్తానికి ఇవి మంచిస్ స్పైసి అప్డేట్సే.

ఇది పూర్తి చేశాక బాలకృష్ణ అనిల్ రావిపూడి సినిమా మొదలవుతుంది. స్క్రిప్ట్ ఆల్మోస్ట్ లాక్ అయినట్టే. ఎఫ్3 రిలీజయ్యాక అనిల్ ఫైనల్ వెర్షన్ ని ఫినిష్ చేసి ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లాలనేది డిసైడ్ చేస్తాడు. అఖండ సక్సెస్ తర్వాత మార్కెట్ మళ్ళీ తగ్గకుండా బాలయ్య ఆచితూచి మరీ కథలను దర్శకులను ఎంచుకుంటున్నారు. అందులో భాగంగానే యంగ్ జెనరేషన్ కి ఎక్కువ ఛాన్స్ ఇస్తున్నారు. సీనియర్లకు వీలైనంత దూరంగా ఉంటున్నారు. బోయపాటి తప్ప గత రెండు దశాబ్దాల్లో బాలయ్యకు చెప్పుకోదగ్గ పెద్ద హిట్ ఎవరూ ఇవ్వలేదన్న నెగటివ్ సెంటిమెంట్ ని గోపిచంద్ మలినేని బ్రేక్ చేస్తాడేమో చూడాలి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişberlinbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom