iDreamPost
android-app
ios-app

Mastan Sai: మస్తాన్ సాయి ఫోన్‌‌లో 800కి పైగా అమ్మాయిల వీడియోలు

  • Published Aug 13, 2024 | 4:01 PM Updated Updated Aug 13, 2024 | 4:01 PM

Mastan Sai Phone Secrets: రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో డ్రగ్ పెడ్లర్ మస్తాన్ సాయి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. తనపై అత్యాచారయత్నం చేశాడని లావణ్య ఫిర్యాదు చేయడంతో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసుల విచారణలో మస్తాన్ సాయి ఫోన్ లో రహస్యాలు బయటపడుతున్నాయి.

Mastan Sai Phone Secrets: రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో డ్రగ్ పెడ్లర్ మస్తాన్ సాయి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. తనపై అత్యాచారయత్నం చేశాడని లావణ్య ఫిర్యాదు చేయడంతో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసుల విచారణలో మస్తాన్ సాయి ఫోన్ లో రహస్యాలు బయటపడుతున్నాయి.

  • Published Aug 13, 2024 | 4:01 PMUpdated Aug 13, 2024 | 4:01 PM
Mastan Sai: మస్తాన్ సాయి ఫోన్‌‌లో 800కి పైగా అమ్మాయిల వీడియోలు

రాజ్ తరుణ్, లావణ్యల వివాదం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా పరిచయం అయ్యాక రాజ్ తరుణ్ తనను దూరం పెట్టాడని లావణ్య ఆరోపించింది. రాజ్ తరుణ్, తాను ఇద్దరం ప్రేమించుకున్నామని.. ఒక గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని లావణ్య వెల్లడించింది. రాజ్ తరుణ్ తనకు అబార్షన్ కూడా చేయించాడని ఆమె తెలిపింది. అయితే రాజ్ తరుణ్ మాత్రం తమ రిలేషన్ ఎప్పుడో ముగిసిపోయిందని.. లావణ్యకు డ్రగ్ పెడ్లర్ మస్తాన్ సాయితో సంబంధం ఉందని వెల్లడించారు. లావణ్య డ్రగ్స్ కూడా తీసుకుంటుందని ఆరోపించారు. కాగా మస్తాన్ సాయిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న మస్తాన్ సాయిని గుంటూరు జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు.

లావణ్య మస్తాన్ సాయి మీద అత్యాచారం కేసు కూడా పెట్టింది. అయితే మస్తాన్ సాయి కేసులో పలు సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. డ్రగ్స్ సరఫరా చేయడమే కాకుండా పలువురు అమ్మాయిలను ట్రాప్ చేసేవాడని.. వారి వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ కు పాల్పడేవాడని పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణలో భాగంగా మస్తాన్ సాయి ఫోన్ లో సీక్రెట్స్ బయటపడ్డాయి. మస్తాన్ ఫోన్ లో 800కి పైగా అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

తన ఇంట్లో రహస్య కెమెరాలు పెట్టి.. అమ్మాయిల వీడియోలు రికార్డ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఒక కంపెనీలో టెక్నికల్ టీమ్ లో జాబ్ చేస్తున్న మస్తాన్ సాయి.. అమ్మాయిల వీడియోలను సీక్రెట్ గా రికార్డ్ చేసి ఆ తర్వాత వారిని బెదిరించి లొంగదీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిలో తన ప్రైవేట్ వీడియో కూడా ఉందని.. తనను కూడా బెదిరించాడని లావణ్య చెప్పుకొచ్చింది. ఏప్రిల్ 2023లో మస్తాన్ సాయి గుంటూరులో తన చెల్లెలి పెళ్లి ఉందని చెప్పి లావణ్యను ఆహ్వానించాడు. అయితే హోటల్ లో ఉన్న సమయంలో తనను మస్తాన్ సాయి కొట్టి ఫోన్ లాక్కున్నాడని.. ఆపై అత్యాచారయత్నం చేశాడని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు.  

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss