iDreamPost
android-app
ios-app

Niharika Konidela: యంగ్ హీరో వల్ల నిహారికాకు చేదు అనుభవం!?

  • Published Feb 28, 2024 | 4:04 PM Updated Updated Feb 28, 2024 | 4:32 PM

మెగా డాటర్ నిహారికాకు చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో వల్ల ఆవిడకు ఊహించని అనుభవం ఎదురైందని టాక్ నడుస్తోంది.

మెగా డాటర్ నిహారికాకు చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. టాలీవుడ్ యంగ్ హీరో వల్ల ఆవిడకు ఊహించని అనుభవం ఎదురైందని టాక్ నడుస్తోంది.

  • Published Feb 28, 2024 | 4:04 PMUpdated Feb 28, 2024 | 4:32 PM
Niharika Konidela: యంగ్ హీరో వల్ల నిహారికాకు చేదు అనుభవం!?

మెగా డాటర్ నిహారిక కొణిదెలకు మంచి ఫాలోయింగే ఉంది. హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రొడ్యూసర్ గా కూడా మారిన విషయం తెలిసిందే. ఎప్పుడూ కొత్త కొత్త ఛాలెంజెస్ తీసుకోవడంలో నిహారిక ముందుంటుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత మళ్లీ హోస్ట్ గా మారిన విషయం తెలిసిందే. షెఫ్ మంత్ర సీజన్ 3కి నిహారిక కొణిదెల హోస్ట్ గా వ్యవహరిస్తోంది. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ షోలో నిహారికాకు చేదు అనుభవం ఎదురైందని తెలుస్తోంది.

నిహారిక ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ కూడా ఎతో హుషారుగా, చలాకీగా ఉంటుంది. ఆమె అటు ఆర్టిస్టుగానే కాకుండా.. నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి హోస్ట్ గా తన టాలెంట్ ని ప్రదర్శించేందుకు రెడీ అయిపోయింది. అందుకు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్న షెఫ్ మంత్రా సీజన్ 3 వేదిక కాబోతోంది. ఇప్పటికే ఈ షోకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేశారు. నిహారికాను హోస్ట్ గా ప్రకటిస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

తాజాగా ఈ షూట్ కూడా షెడ్యూల్ అయ్యింది. బుధవారం(ఫిబ్రవరి 28) ఒక టాలీవుడ్ యంగ్ హీరోతో షూట్ కూడా షెడ్యూల్ చేశారు. అంతా రెడీ చేశారు. షూట్ చేసేందుకు ఎదురుచూస్తూ ఉన్నారు. ఎంతకీ ఆ యంగ్ హీరో రాలేదంట. రావడానికి లేటవుతోంది అని చెప్పడంతో వెయిట్ చేస్తూ ఉన్నారంట. అలా అలా మధ్యాహ్నం కూడా అయిపోయింది. అతను ఎతకీ రాకపోవడంతో చివరికి షూట్ కూడా క్యాన్సిల్ చేశారని టాక్ నడుస్తోంది. ఈ షెఫ్ మంత్ర సీజన్ 3ని మార్చి 3వ తేదీన గ్రాండ్ గా లాంఛ్ చేయబోతున్నాం అంటూ వెల్లడించారు. అయితే ఇప్పుడు ఈ షూట్ క్యాన్సిల్ కావడంతో ఆ డేట్ కూడా ఏమైనా మారుతుందా? లేక అదే డేట్ కి తొలి ఎపిసోడ్ ని స్ట్రీమ్ చేస్తారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

సీజన్ 3 కాబట్టి.. మార్చి 3న స్టార్ట్ చేయాలి అని అనుకుని ఉండచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ సీజన్ 3ని మార్చి 3కే స్టార్ట్ చేస్తారనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇంక నిహారిక యాంకరింగ్ గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఇప్పటికే ఢీ జూనియర్స్ షోకి హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. నిహారిక కొణిదెలకు బెస్ట్ ఫీమేల్ యాంకర్ అవార్డు కూడా దక్కింది. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత మరోసారి హోస్ట్ గా మ్యాజిక్ చేసేందుకు నిహారిక రెడీ అయిపోయింది. లాస్ట్ సీజన్ కి మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఈ సీజన్ కు నిహారిక ను సెలక్ట్ చేశారు. మరి.. యంగ్ హీరో వల్ల కొణిదెల నిహారికాకు చేదు అనుభవం ఎదురైందంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş