iDreamPost
android-app
ios-app

బేబీ ఓటిటి రిలీజ్! ప్లాన్ మార్చుకున్న ఆహా!

  • Author ajaykrishna Published - 03:22 PM, Tue - 25 July 23
  • Author ajaykrishna Published - 03:22 PM, Tue - 25 July 23
బేబీ ఓటిటి రిలీజ్! ప్లాన్ మార్చుకున్న ఆహా!

ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాలు సాధిస్తున్నాయో తెలిసిందే. గత నెలలో కామెడీ ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా విడుదలైన ‘సామజవరగమన’ థియేటర్స్ లో డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా రూ. 50 కోట్ల క్లబ్ లో చేరి ఊహించని రికార్డు సెట్ చేసింది. ఈ నెలలో బేబీ మూవీ అలాంటి సంచలనమే సృష్టించింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా బేబీ. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా దర్శకుడు సాయి రాజేష్ ఈ సినిమాను తెరకెక్కించాడు. నిర్మాత ఎస్.కే.ఎన్ ఈ సినిమాను నిర్మించారు. అయితే.. జులై 14 క్రేజీ బజ్ తో విడుదలైన ఈ సినిమా.. ప్రేక్షకుల అంచనాలను బీట్ చేస్తూ బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది.

బాక్సాఫీస్ వద్ద రూ. 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన బేబీ.. కేవలం రెండు రోజుల్లోనే టార్గెట్ ఫినిష్ చేసి.. ఊహించని ఫలితం అందుకుంది. అటు టాక్ పరంగా.. ఇటు కలెక్షన్స్ పరంగా అద్భుతాలు సృష్టిస్తోంది. విడుదలైన కొద్దిరోజులకే బేబీ ఏకంగా.. రూ. 50 కోట్ల క్లబ్ లో చేరి ఔరా అనిపించింది. ఓవైపు హీరోయిన్ గా వైష్ణవికి బెస్ట్ డెబ్యూ మూవీ కాగా.. మరోవైపు ఆనంద్ కి ఫస్ట్ కమర్షియల్ హిట్ బేబీ అని చెప్పుకోవచ్చు. మరి కల్ట్ బ్లాక్ బస్టర్ గా ప్రచారం పొందుతున్న ఈ మూవీ కోసం యూత్ అయితే తెగ అట్రాక్ట్ అయిపోయారని చెప్పవచ్చు. ఎక్కడ చూసినా యూత్ ఆడియన్స్ బేబీ మూవీకి బ్రహ్మరధం పడుతుండటం విశేషం.

ఇలాంటి తరుణంలో రెండో వారంలోను సినిమా కలెక్షన్స్ ఏమాత్రం తగ్గకపోవడంతో.. ఓటిటి రిలీజ్ విషయంలో ఆహా వారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బేబీ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ఆహా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ముందుగా ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ తర్వాత నెల రోజులకు అంటే.. ఆగష్టు 15న రిలీజ్ చేస్తారని టాక్ బయటికి వచ్చింది. కానీ.. ఇప్పుడు అందుకున్న తాజా సమాచారం ప్రకారం.. సినిమా కలెక్షన్స్ బాగున్నాయని.. ఓటిటి రిలీజ్ ని మరికొన్ని రోజులకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారికంగా క్లారిటీ రాలేదు. కానీ.. ఓటిటి ఫ్యాన్స్ మాత్రం బేబీ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ కి వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. సో.. బేబీ మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetmoney girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş