ఎట్టకేలకు ఆనంద్ దేవరకొండకు మొదటి కమర్షియల్ హిట్ ‘బేబీ’ మూవీ రూపంలో దొరికింది. అదికూడా మీడియం రేంజ్ హీరోల సినిమాల లెవెల్ లో బేబీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుండటం విశేషం. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా ‘బేబీ’. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా డైరెక్టర్ సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ సినిమా.. హిట్ టాక్ తో పాటు కలెక్షన్స్ వైస్ కూడా దూసుకుపోతుంది. ఫస్ట్ వీకెండ్ లోనే కాదు.. బేబీ మూవీ సోమవారం కూడా మంచి వసూళ్లు రాబట్టి.. ఊహించని లాభాలను ఖాతాలో వేసుకుందని సినీ వర్గాల సమాచారం.
జనరల్ గా హిట్ టాక్ తెచ్చుకున్నా.. సినిమాలు సోమవారం కలెక్షన్స్ కొంచం తగ్గిపోతాయి. కానీ.. బేబీ సినిమాకు లక్ కొద్దీ తెలంగాణలో గవర్నమెంట్ హాలిడే కావడం కలెక్షన్స్ కి బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. ఈ సినిమాకి ఏపీలోను నాలుగో రోజు హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. వెరసి.. సినిమా నాలుగు రోజులకు కేవలం తెలుగు రాష్ట్రలలోనే రూ. 22.80 కోట్లు గ్రాస్ వసూల్ చేసింది. షేర్ పరంగా చూస్తే.. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి.. ఇక మొత్తంగా నాలుగవ రోజు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది 13.07 కోట్ల షేర్ రాబట్టిందని తెలుస్తోంది.
అదేవిధంగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ఏరియాలలో నాలుగు రోజులకు గాను బేబీ రూ. 56 లక్షలు.. ఓవర్సీస్ లో రూ. 1.78 కోట్లు కొల్లగొట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. బేబీ నాలుగు రోజులకు రూ. 15.41 కోట్ల షేర్.. రూ. 28.60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకోవడం విశేషం. ఇప్పటిదాకా చూసుకుంటే బేబీ మూవీ.. పెట్టిన దానికంటే రూ. 7.40 కోట్ల లాభాలు వెనకేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అసలు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరుపుకుందనే వివరాల్లోకి వెళ్తే.. బేబీ రూ. 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. మూడో రోజే లాభాల బాటపట్టిన బేబీ.. నాలుగో రోజుకు డబుల్ ప్రాఫిట్ తెచ్చింది. సో.. ఈ వీక్ లో వేరే మూవీస్ వచ్చేదాకా బేబీ జోరు కొనసాగే ఛాన్స్ లేకపోలేదు. మరి బేబీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.