iDreamPost
android-app
ios-app

అభిమానులకు తంగలాన్‌ టీమ్‌ గుడ్‌న్యూస్‌.. నేటి నుంచే..

  • Published Aug 10, 2024 | 9:13 AM Updated Updated Aug 10, 2024 | 9:13 AM

Thangalaan Bookings : ఇటీవల స్టార్ హీరోల సినిమాలు షూటింగ్ మొదలు బుకింగ్ దగ్గర నుంచి థియేటర్లో రిలీజ్ అయి ఎండ్ కలెక్షన్ల వరకు ప్రతీది న్యూస్ అవుతున్న విషయం తెలిసిందే. సినిమాపై బజ్ క్రియేట్ చేయడానికి మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Thangalaan Bookings : ఇటీవల స్టార్ హీరోల సినిమాలు షూటింగ్ మొదలు బుకింగ్ దగ్గర నుంచి థియేటర్లో రిలీజ్ అయి ఎండ్ కలెక్షన్ల వరకు ప్రతీది న్యూస్ అవుతున్న విషయం తెలిసిందే. సినిమాపై బజ్ క్రియేట్ చేయడానికి మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

  • Published Aug 10, 2024 | 9:13 AMUpdated Aug 10, 2024 | 9:13 AM
అభిమానులకు తంగలాన్‌ టీమ్‌ గుడ్‌న్యూస్‌.. నేటి నుంచే..

తెలుగు ఇండస్ట్రీలోకి చియాన్ విక్రమ్ అంటే తెలియని వారు ఉండరు. తమిళ నటుడు అయినప్పటికీ విక్రమ్ కి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. తెలుగు లో చిరునవ్వులా వరమిస్తావా, బంగార కుటుంబం ఇలా పలు చిత్రాల్లో నటించాడు. ఇండస్ట్రీలో విశ్వనటుడు కమల్ హాసన్ తర్వాత ఆ తరహా ప్రయోగాత్మక చిత్రాల్లో నటించిన ఏకైకహీరో విక్రమ్. అప్పట్లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఐ’ మూవీ కోసం బరువు తగ్గి అందవికారంగా కనిపించి ప్రేక్షకులను అబ్బుర పరిచాడు. అపరిచితుడు మూవీలో విక్రమ్ నటనకు విమర్శకులు నుంచి ప్రశంసల వర్షం కురిసింది. ప్రస్తుతం ‘తంగలాన్’ మూవీలో నటిస్తున్నాడు విక్రమ్. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగాయి. అభిమానులకు చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. . వివరాల్లోకి వెళితే..

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. నటించిన చిత్రాలు కొన్నే అయినా..పాన్ ఇండియాగా హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు విక్రమ్.తాజాగా పా రంజీత్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన పీరియాడిక్ చిత్రం ‘తంగలాన్’. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కించారు. ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తగా రిలీజ్ చేసేందుక సిద్దమయ్యారు మూవీ మేకర్స్. ఈ మూవీ బుకింగ్స్ నేటి నుంచి అంటే శనివారం (ఆగస్టు 10) ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ పై ప్రేక్షకులు, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ‘తంగలాన్’ మూవీ తెరకెక్కించినట్లు ఇండస్ట్రీలో టాక్.

good news from thangalaan team

ఇదిలా ఉంటే.. హీరో విక్రమ్ అండ్ టీమ్ పలు ప్రాంతాలకు వెళ్లి మూవీ ప్రమోషన్ల బిజీలో ఉన్నారు. ఇటీవల మూవీ ప్రమోషన్ లో భాగంగా హీరో విక్రమ్ ని విలేకరులు తంగలాన్ కి సీక్వెల్ ఉందా? అని ప్రశ్నించారు. దానికి విక్రమ్ బదులిస్తూ.. సీక్వెల్ లేదా ప్రీక్వెల్ ఉండొచ్చు అనే స్కోప్ ఉందన్నారు. ఇందులో చాలా కథాంశాలు ముడిపడి ఉన్నాయి.. అందుకే ఈ మూవీ సీక్వెల్స్ ఉండే అవకాశం ఉందన్నారు.  ఈ మూవీలో విక్రమ్ ఆహార్యం కూడా చాలా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తుంది. ఈ మూవీలోమాళవిక మోహన్, పార్వతి తిరువోతు, పశుపతి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్, జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందించారు.

 

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetbetwooncasibomcasibombetcio girişgrandpashabet