Krishna Kowshik
2003లో కెరీర్ స్టార్ చేసిన ప్రియమణి.. ఇప్పుడు కూడా మంచి సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళుతుంది. భామా కలాపం 2తో పలకరించబోతోంది. ఫిబ్రవరి 16న ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. అయితే ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు కొంత మంది ఆడియన్స్.. ఎందుకంటే..?
2003లో కెరీర్ స్టార్ చేసిన ప్రియమణి.. ఇప్పుడు కూడా మంచి సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళుతుంది. భామా కలాపం 2తో పలకరించబోతోంది. ఫిబ్రవరి 16న ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. అయితే ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారు కొంత మంది ఆడియన్స్.. ఎందుకంటే..?
Krishna Kowshik
నటి ప్రియమణి గురించి, ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ మొదలైన తొలి నాళ్లలోనే డీ గ్లామరైజ్డ్ పాత్ర చేసి నేషనల్ అవార్డును కొల్లగొట్టింది. పరుత్తి వీరన్ అనే తమిళ చిత్రానికి ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డు వచ్చింది. ఈ ఒక్కటి చాలు ఆమె ఎంతటి గొప్పనటో చెప్పేందుకు. ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీని చుట్టేసింది ఈ భామ.. హిందీలోనూ మంచి పాత్రలను సొంతం చేసుకుంటోంది. తెలుగులోనే ఆమె కెరీర్ స్టార్ అయ్యింది. ఎవడే అతగాడు అనే మూవీ ప్రియమణి తొలి చిత్రం. పెళ్లైన కొత్తలో, యమదొంగ, నవ వసంతం, హరే రామ్, మిత్రుడు, ప్రవరాఖ్యుడు, గోలిమార్ ఆమెను స్టార్ హీరోయిన్ చేశాయి. 2003లో మొదలైన ఆమె సినీ కెరీర్.. ఇప్పటి వరకు అప్రతిహితంగా కొనసాగుతూనే ఉంది. ఏ ఒక్క ఏడాది కూడా ఆమె సినిమాలతో పలకరించకుండా లేదు.
హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిపోతున్నాయనుకున్న సమయంలో.. క్యాచీ కథలను ఎంచుకుంటూ.. ముందుకు సాగుతుంది. నారప్ప, విరాట పర్వం, కస్టడీ, జవాన్ ఇందుకు ఉదాహరణ. అలాగే ఓటీటీలో కూడా దుమ్మురేపుతోంది. ఫ్యామిలీమాన్, హిజ్ స్టోరీ, భామా కలాపం సిరీస్, సినిమాలు మంచి రివ్యూస్ సాధించాయి. పెళ్లైతే అవకాశాలు తగ్గిపోతాయనే పదానికి ఈమె మినహాయింపు. అయితే ఇటీవల ఈమె నెగిటివిటీ మూటగట్టుకుంది. దానికి కారణం నేరు సినిమా. మోహన్ లాల్, జీతు జోసెఫ్ కోర్టు డ్రామా మూవీ నేరులో ప్రియమణి పూర్ణిమ అనే క్యారెక్టర్‌లో నటించింది. ఇందులో నేరస్థుడి తరుపున లాయర్‌గా ప్రియమణి వాదించడంతో.. ఆమెను తిట్టిపోస్తున్నారు ఈ చిత్రాన్ని చూసిన వీక్షకులు.
అందులో విలన్ తప్పు చేశాడని తెలిసినా, డబ్బు కోసం తన తండ్రి తరుఫున వకాల్తా పుచ్చుకుని.. ఆర్గ్యూ చేస్తుంది. ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.. కానీ కొందరు పనిగట్టుకుని విమర్శిస్తున్నారు. హీరోయిన్ నెగిటివ్ క్యారెక్టర్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. అది కేవలం నటనేనని మర్చిపోయి వ్యక్తిగత దూషణ చేస్తున్నారు. బేబి మూవీలో వైష్ణవి విషయంలో ఇదే జరిగింది. భిన్నమైన క్యారెక్టర్ చేస్తేనే నటిగా గుర్తింపు దక్కుతుంది. ఇలా ప్రియమణికి ప్రతికూలత వస్తుందంటే.. నటిగా సెంట్ పర్సంట్ సక్సెస్ అయినట్లే. సో విమర్శలు మానేసి.. సినిమాను సినిమాగా చూస్తే.. వాళ్లు కూడా కొత్తగా కనిపించేందుకు అవకాశం ఉంటుంది. మంచి మూవీస్ మన ముందుకు రాగలుగుతాయి.
ప్రస్తుతం నేరు మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతుంది. మంచి కథనం, కథనాలతో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో అదరగొట్టాడు జీతూ జోసెఫ్. ఇక కథ విషయానికి వస్తే.. కళ్లు లేని అమ్మాయిపై ఓ యువకుడు అత్యాచారం చేస్తాడు. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేస్తారు తల్లిదండ్రులు. అయితే ఆమె ఎలా గుర్తు పడుతుంది అనగానే.. ట్విస్ట్ ఇస్తూ.. ఓ రూపాన్ని మలుస్తుంది. ఈ కేసు కోర్టు మెట్టెక్కుతుంది. కళ్లులేని అమ్మాయి తరుఫున మోహన్ లాల్, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తరుఫున ప్రియమణి, సిద్దిఖీ వాదిస్తారు. చివరకు ఎవరు గెలిచారనేది కథ.