iDreamPost
android-app
ios-app

Summer Films: ఈ వేసవిలో పెద్ద సినిమాలు లేనట్టే

  • Published Feb 03, 2024 | 1:09 PM Updated Updated Feb 03, 2024 | 1:28 PM

ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమలో సంక్రాంతి హంగామా మిశ్రమ ఫలితాలను మిగిల్చింది.ఈ నేపధ్యంలో ఎంటర్టైన్మెంట్ కోరుకునే తెలుగు ప్రేక్షకులకు తమ సినిమాలను అందించే భాధ్యత యువ హీరోల పైనే పడింది.

ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమలో సంక్రాంతి హంగామా మిశ్రమ ఫలితాలను మిగిల్చింది.ఈ నేపధ్యంలో ఎంటర్టైన్మెంట్ కోరుకునే తెలుగు ప్రేక్షకులకు తమ సినిమాలను అందించే భాధ్యత యువ హీరోల పైనే పడింది.

  • Published Feb 03, 2024 | 1:09 PMUpdated Feb 03, 2024 | 1:28 PM
Summer Films: ఈ వేసవిలో పెద్ద సినిమాలు లేనట్టే

సాధారణంగా సినిమా పరిశ్రమకు సంక్రాంతి తరువాత సమ్మర్ సీజన్ ను అత్యంత లాభదాయకమైన సీజన్ గా భావిస్తారు. అయితే 2024 సమ్మర్ ను ఏ పెద్ద హీరొ కూడా ఉపయోగించుకో లేకపోతున్నారు. ఎందుకంటే ఈ వేసవిలో ఏ పెద్ద హీరో సినిమా కూడా విడుదల కావడం లేదు.

ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమలో సంక్రాంతి హంగామా మిశ్రమ ఫలితాలను మిగిల్చింది, “హను మాన్” సినిమా బ్లాక్ బస్టర్ స్టేటస్ ను సాధించగా మిగతా సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు. రాబోయే సమ్మర్ సీజన్ పై దృష్టి మళ్లడంతో టాప్ స్టార్స్ నటించే సినిమాల పై అంచనాలు పెరిగిపోయాయి.

కానీ ఎన్టీఆర్ దేవర సినిమా ఏప్రిల్ 5 నుంచి వాయిదా పడింది. ప్రభాస్ కల్కి 2808 AD కూడా ముందుగా అనుకున్న ప్రకారం మే 9న విడుదల కాకపోవచ్చు అనే అంటున్నారు. ఈ నేపధ్యంలో ఎంటర్టైన్మెంట్ కోరుకునే తెలుగు ప్రేక్షకులకు తమ సినిమాలను అందించే భాధ్యత యువ హీరోల పైనే పడింది. వీటిలో సిద్ధూ జొన్నలగడ్డ ‘టిల్లు స్క్వేర్’, విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రాలు వరుసగా మార్చి 29, ఏప్రిల్ 5న కన్ఫర్మ్ అయ్యాయి. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ స్టార్ సినిమా పై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా చాలా ఆశలే పెట్టుకున్నాయి.

వరుస పరాజయాల తర్వాత దర్శకుడు పూరి జగన్నాథ్ యొక్క ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు రామ్. మొదట ఈ సినిమాను మహా శివరాత్రి పండుగ రోజున అంటే 2024 మార్చి 8న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఓటీటీ, హిందీ డబ్బింగ్ మార్కెట్ లో అవాంతరాల కారణంగా ఐకానిక్ పోకిరి తేదీ ఏప్రిల్ 28న లేదా మేలో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇక సమ్మర్ రిలీజ్ టార్గెట్ గా శర్వానంద్ తో శ్రీరామ్ ఆదిత్య “మనమే” అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. మరి యువ హీరోలు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా లేదా వేచి చూడాలి.