iDreamPost
android-app
ios-app

అంచనాలు పెంచుతున్న‘ఆర్టికల్ 370’.. రిలీజ్ ఎప్పుడంటే?

  • Published Feb 08, 2024 | 9:31 PM Updated Updated Feb 08, 2024 | 9:31 PM

Article 370 Trailer: దేశంలో జరిగిన పలు సంఘటనల ఆధారంగా ఇటీవల సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ఆర్టికల్ 370 ఆధారంగా మూవీ తెరకెక్కించారు

Article 370 Trailer: దేశంలో జరిగిన పలు సంఘటనల ఆధారంగా ఇటీవల సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే ఆర్టికల్ 370 ఆధారంగా మూవీ తెరకెక్కించారు

అంచనాలు పెంచుతున్న‘ఆర్టికల్ 370’.. రిలీజ్ ఎప్పుడంటే?

ఇటీవల సినీ ఇండస్ట్రీలో బయోపిక్ చిత్రాలు, యాదార్థ సంఘటనల ఆధారంగా తెరెకెక్కిస్తున్న చిత్రాలకు మంచి ఆధరణ లభిస్తుంది. ఈ తరహాలో వచ్చిన చిత్రం ‘కాశ్మీర్ ఫైల్స్’. 1990లో సమయంలో కాశ్మీర్ నుంచి కశ్మీరీ హిందువుల వలసల వెళ్లిన తీరు.. వారిపై జరిగిన అకృత్యాలకు కళ్లకు కట్టినట్టూ చూపించారు దర్శకులు. ఇలాంటి చిత్రాలు గతంలో కూడా ఎన్నో వచ్చాయి. తాజాగా ప్రధాని మోదీ తీసుకున్న సంచలన నిర్ణయాల్లో ఒకటి జమ్ముకాశ్మీర్ లో 370 వ అధికరణ ఎత్తివేత. ఇదే ప్రధానాంశంగా పొలిటికల్ థ్రిల్లర్ గా చిత్రం ‘ఆర్టికల్ 370’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ లో ఈ మధ్య వాస్తవిక ఆధారంగా రూపొందిన చిత్రాలు బాగా వస్తున్నాయి. ఇలాంటి చిత్రాలు ఆడియన్స్ కూడా బాగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వంలో బాలీవుడ్ భామ యామీ గౌతమ్, ప్రియమణి, అరుణ్ గోవిల్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఆర్టికల్ 370’ తెరకెక్కిస్తున్నారు. గురువారం ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. 2019 ఫిబ్రవరి 17న పుల్వామా దాడి తర్వాత జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసే అంశం కనిపిస్తుంది. 370 ని రద్దు చేసిన క్రమంలో కశ్మీర్ లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పోరాటాలు, ఘర్షణలు కళ్లకు కట్టినట్టు చూపించారు దర్శకులు. ఈ మూవీలో యామీ గౌతమ్ ఒక పవర్ ఫుల్ ఇంటిలిజెనస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. జియో స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఆర్టికల్ 370 మూవీలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్రపై నెటిజన్లు తెగ సర్చ్ చేస్తున్నారు. ఆ క్యారెక్టర్ ఎవరు చేశారు అని ఆసక్తిగా ఎదురు చూశారు. ఆర్టికల్ 370 మూవీలో ప్రధాని పాత్రలో ఒకప్పుటి బుల్లితెరపై శ్రీరాముడిగా కనిపించిన నటుడు అరుణ్ గోవిల్. ఈ మూవీలో ఆయన పాత్రల కూడా చాలా పవర్ ఫుల్ గా చూపించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక కేంద్ర హూంమంత్రి అమిత్ షా పాత్రలో కిరణ్ కర్మాకర్ నటించారు. ట్రైలర్ చూసిన తర్వాత అప్పుడు రాముడు.. ఇప్పుడు ప్రధాని మోదీ అంటూ అరుణ్ గోవిల్ ని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అభిమానులు. ఈ ట్రైలర్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.