iDreamPost
android-app
ios-app

Arbaaz Khan: సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ రెండో పెళ్లి.. ఫోటోలు వైరల్

  • Published Dec 25, 2023 | 12:21 PM Updated Updated Dec 25, 2023 | 12:21 PM

సాధారంగాణ చిత్ర పరిశ్రమలో చాలా మంది తమ సహనటులను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. అలా పెళ్లి చేసుకున్న చాలా జంటలు కలిసి మెలిసి ఉంటున్నా..కొన్ని జంటలు మాత్రం అభిప్రాయభేదాలు రావడంతో విడాకులు తీసుకుంటున్నారు.

సాధారంగాణ చిత్ర పరిశ్రమలో చాలా మంది తమ సహనటులను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. అలా పెళ్లి చేసుకున్న చాలా జంటలు కలిసి మెలిసి ఉంటున్నా..కొన్ని జంటలు మాత్రం అభిప్రాయభేదాలు రావడంతో విడాకులు తీసుకుంటున్నారు.

  • Published Dec 25, 2023 | 12:21 PMUpdated Dec 25, 2023 | 12:21 PM
Arbaaz Khan: సల్మాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ రెండో పెళ్లి.. ఫోటోలు వైరల్

సినీ ఇండస్ట్రీలో చాలా వరకు నటీనటులు తమ సహనటులను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. కొన్ని జంటలు ఎంతో అన్యోన్యంగా కలిసి మెలిసి ఉంటే.. మరికొందరు మాత్రం పెళ్లైన కొంతకాలనికి విభేదాలు రావడంతో విడాకులు తీసుకుంటున్నారు. తర్వాత తమకు ఇష్టమైన వారిని వివాహం చేసుకొని వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. తెలుగు, తమిళ, మళయాల భాషల్లో పలు చిత్రాల్లో విలన్ గా నటించాడు. తెలుగులో చిరంజీవి నటించిన జై చిరంజీవ చిత్రంలో విలన్ గా నటించాడు. తాజాగా అర్బాజ్ ఖాన్ బంధుమిత్రుల సమక్షంలో రెండో పెళ్లి చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే…

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్. ఇండస్ట్రీలో దర్శకుడు, నిర్మాత, నటుడిగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. తెలుగులో మెగాస్టార్ నటించిన జై చిరంజీవి, రాజ్ తరుణ్ నటించిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త లో విలన్ గా నటించాడు. మాలీవుడ్ లో మోహన్ లాన్ నటించిన బిగ్ బ్రదర్ మూవీలో నెగిటీవ్ పాత్రలో నటించి మెప్పించాడు. ప్రముఖ మోడల్, నటి అయిన మలైకా అరోరాను 1998లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 17 ఏళ్ల వీరి వైవాహిక జీవితంలో అర్హన్ ఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో మార్చి 28, 2016లో విడిపోతాం అని ప్రకటించి.. 2017లో విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం మలైకా హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉంది. కొంతకాలంగా అర్బాజ్ ఖాన్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని రూమర్లు వస్తున్నాయి.

ఇక రూమర్లన్నింటికి చెక్ పెడుతూ.. సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ ఇంట్లో అర్బాజ్ ఖాన్, మేకప్ ఆర్టిస్టు షురా ఖాన్ ని వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి వేడుకకు సల్మాన్ ఖాన్ కుటుంబ సభ్యులు, పలువురు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ పెళ్లిలో ఆయన కొడుకు అర్హన్ ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తాజాగా తన పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు అర్బాజ్ ఖాన్ తన ఇన్ స్ట్రాగామ్ లో పోస్ట్ చేశాడు. ‘నా ప్రియమైన వారి సమక్షంలో కొత్తజీవితంలోకి అడుగుపెడుతున్నా.. మీ అందరి ఆశీస్సులు, శుభాకాంక్షలు కావాలి’ అంటో క్యాప్షన్ యాడ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Arbaaz Khan (@arbaazkhanofficial)

Jojobet GirişmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetjojobetcasibompokerklas giriş