iDreamPost
android-app
ios-app

స్టాలిన్ కాంబో రిపీట్! మెగాస్టార్ తో మురుగదాస్ మరో సినిమా?

  • Author ajaykrishna Updated - 03:27 PM, Thu - 17 August 23
  • Author ajaykrishna Updated - 03:27 PM, Thu - 17 August 23
స్టాలిన్ కాంబో రిపీట్! మెగాస్టార్ తో మురుగదాస్ మరో సినిమా?

ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన కాంబినేషన్స్ మళ్లీ మళ్లీ రిపీట్ అయితే ఫ్యాన్స్ లో కలిగే ఆనందం వేరుగా ఉంటుంది. ఆల్రెడీ సూపర్ హిట్ సినిమాలు చేశారు కాబట్టి.. మళ్లీ అలాంటి సినిమానే వస్తుందని వీళ్ల ఎక్స్ పెక్టేషన్స్ వీళ్లకు ఉంటాయి. ఇప్పటికి టాలీవుడ్ లో సూపర్ హిట్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. కానీ.. మెగాస్టార్ తో సినిమాలు చేసే డైరెక్టర్స్ మాత్రం చాలా ఇంటరెస్ట్ క్రియేట్ చేస్తుంటారు. మరోసారి మెగాస్టార్ చిరంజీవితో సూపర్ హిట్స్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ రిపీట్ కాబోతుందని టాక్. మెగాస్టార్ – స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే వీరి కాంబోలో ఇప్పటిదాకా 3 బ్లాక్ బస్టర్స్ వచ్చాయి.

అదేంటీ.. మురుగదాస్ తో చిరు.. స్టాలిన్ సినిమా ఒక్కటే కదా చేసింది అనుకోవచ్చు. దర్శకుడిగా మురుగదాస్ చిరుతో చేసింది స్టాలిన్ ఒకటే. కానీ.. మురుగదాస్ కథలతో చిరు రెండు బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఆ రెండు సినిమాలు ఏవంటే.. ఠాగూర్, ఖైదీ నెం 150. ఈ రెండు సినిమాలు(రమణ, కత్తి) తమిళం నుండి రీమేక్ చేశారు. అయితే.. ఆ రెండు సినిమాలను తమిళంలో మురుగదాస్ తెరకెక్కించాడనే సంగతి ఎంతమందికి తెలుసు. అలా ఇండైరెక్ట్ గా చిరు కెరీర్ లో సూపర్ హిట్ కథలు అందించిన క్రెడిట్ మురుగదాస్ కి దక్కుతుంది. వీరి కాంబినేషన్ లో స్టాలిన్ వచ్చి.. దాదాపు 17 ఏళ్లు అవుతోంది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ క్రేజీ కాంబో రిపీట్ కాబోతుందని ఇండస్ట్రీ వర్గాలలో వినికిడి.

రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి.. మెహర్ రమేష్ కాంబినేషన్ లో భోళా శంకర్ మూవీ చేశాడు. తమిళ వేదాలం సినిమాకు రీమేక్ గా వచ్చిన భోళా.. బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. భారీ డిజాస్టర్ ని మూటగట్టుకుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. భోళా శంకర్ తర్వాత.. మెగాస్టార్ నుండి రీమేక్స్ కాకుండా స్ట్రెయిట్ సినిమాలు రాబోతున్నాయని సమాచారం. ఈ లెక్కన ఇప్పటికే చిరు లైనప్ లో కళ్యాణ్ కృష్ణ, యూవి క్రియేషన్స్ సినిమాలు ఓకే అయ్యాయి. ఇప్పుడు కొత్తగా మురుగదాస్ స్టోరీ ఓకే అయినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ కాంబో నిజమే అయితే.. ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. ఎందుకంటే.. మురుగదాస్ సినిమాల రేంజ్ వేరు. దర్బార్ తర్వాత మురుగదాస్ నుండి సినిమా రాలేదు. సో.. చూడాలి ఈ కాంబినేషన్ గురించి గుడ్ న్యూస్ రానుందేమో! మరి ఈ కాంబో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet