iDreamPost
android-app
ios-app

పవన్ కళ్యాణ్ జీవితంపై సినిమా తీస్తాం! టైటిల్ స్టోరీ ఇదే: మంత్రి అంబటి

  • Author ajaykrishna Published - 11:52 AM, Wed - 2 August 23
  • Author ajaykrishna Published - 11:52 AM, Wed - 2 August 23
పవన్ కళ్యాణ్ జీవితంపై సినిమా తీస్తాం! టైటిల్ స్టోరీ ఇదే: మంత్రి అంబటి

ఏపీ మంత్రి అంబటి రాంబాబు, పవన్ కళ్యాణ్ ల మధ్య రోజురోజుకి వివాదం ముదురుతోంది. రీసెంట్ గా విడుదలైన బ్రో సినిమాలో శ్యాంబాబు క్యారెక్టర్ తో అంబటి రాంబాబుని ఇమిటేట్ చేస్తూ కామెడీ సీన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో తనను పోలిన క్యారెక్టర్ పెట్టి.. శునకానందం పొందుతున్నాడని పవన్ పై ఫైర్ అయిన రాంబాబు.. తాజాగా మరోసారి పవన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ జీవితంపై త్వరలో సినిమా తీయనున్నట్లు మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. పైగా ఆ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ చేశామని.. బ్రో మాదిరిగా మ్రో అని పెడతామంటూ ఫైర్ అయ్యారు. ప్రస్తుతం పవన్, అంబటిల ఇష్యూ ఇండస్ట్రీలో చర్చనీయంశంగా మారింది.

ఈ విషయమై మంత్రి రాంబాబు మాట్లాడుతూ.. పవన్ తో తీయబోయే సినిమా పేరు మ్రో. ఆ పేరు పెట్టడానికి రీసన్ కూడా ఉంది. మ్యారేజెస్, రిలేషన్స్-అఫెండర్ ఈ రెండు కలిపి మ్రో అని పెట్టే ఆలోచన ఉంది. ఆ సినిమా స్టొరీ ఎలా ఉండబోతుందంటే.. ఓ మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న చిన్న కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు. వారిలో పెద్దవారు ఇద్దరు అద్భుతమైన విజయాలు సాధించి సెలబ్రిటీలుగా ఎదుగుతారు. కానీ.. మూడో వ్యక్తి మాత్రం ఎక్కడికెళ్లినా ఊగిపోతూ ఉపన్యాసాలు ఇస్తుంటాడు. అయితే.. ఆ మూడో వ్యక్తి పెళ్లిళ్ల గురించి మేం తీయబోయే సినిమాలో చూపిస్తాము. క్లైమాక్స్ లో మాత్రం మహిళా లోకం మెచ్చుకునే గుణపాఠం ఒకటి చూపిస్తాం” అంటూ ఇండైరెక్ట్ గా సెటైర్స్ వేశారు.

ప్రస్తుతం మంత్రి అంబటి, పవన్ కళ్యాణ్ ల వివాదం రోజురోజుకి ముదురుతుండటం చూస్తున్నాం. ఒకరిపై ఒకరు ఏమాత్రం తగ్గకుండా పరస్పర పోస్టులు, కామెంట్స్ చేసుకుంటున్నారు. ఇటీవల బ్రో సినిమా విడుదలై కలెక్షన్స్ డ్రాప్ అవ్వగానే.. ఆ కలెక్షన్స్ పై కూడా మంత్రి అంబటి రాంబాబు రియాక్ట్ అయ్యారు. నిర్మాతలకు కలెక్షన్స్ నిల్లు.. ప్యాకేజీ స్టార్ కి పాకెట్ ఫుల్లు అని ట్వీట్ వేసి పవన్ పై కౌంటర్ కి దిగారు. దానికి కారణం.. బ్రో సినిమాలో తనను పోలిన క్యారెక్టర్ ని కామెడీగా చూపించడమే. సినిమాలో శ్యాంబాబు అనే పేరు పెట్టగా.. ఆ క్యారెక్టర్ లో నటుడు థర్టీ ఇయర్స్ పృథ్వీ నటించారు. గతంలో మంత్రి రాంబాబు చేసిన డ్యాన్స్ లను ఇందులో రిపీట్ చేసి కామెడీ చేశారు. ఆ కోపంతోనే మంత్రి రాంబాబు పవన్ పై ఫైర్ అవుతున్నారు. మరి మంత్రి అంబటి రాంబాబు, పవన్ ల మధ్య వార్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet