iDreamPost
android-app
ios-app

Anushka Shetty & Naveen Polishetty నవీన్ అనుష్కల డిఫరెంట్ జోడి

  • Published Apr 27, 2022 | 12:41 PM Updated Updated Apr 27, 2022 | 12:41 PM
  • Published Apr 27, 2022 | 12:41 PMUpdated Apr 27, 2022 | 12:41 PM
Anushka Shetty & Naveen Polishetty నవీన్ అనుష్కల డిఫరెంట్ జోడి

ఒకప్పుడు వరస సినిమాలతో దూసుకుపోయి భాగమతి, నిశ్శబ్దం తర్వాత సైలెంట్ అయిపోయిన అనుష్క ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అతనికి జోడినా లేక మరేదైనా ముఖ్యమైన పాత్రా అనే వివరాలు బయటికి రాలేదు కానీ కొన్ని ఇంటరెస్టింగ్ డీటెయిల్స్ అయితే లీక్ అయ్యాయి. అందులో మొదటిది అనుష్క ఇందులో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న చెఫ్ గా నటిస్తోందట. ఏదో ఆషామాషీ వంటలు చేయడం కాకుండా వరల్డ్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకున్న క్యారెక్టర్ లో దర్శకుడు పి మహేష్ చాలా స్పెషల్ గా డిజైన్ చేశారని ఇన్ సైడ్ టాక్. నిర్మాత యువి క్రియేషన్సే.

ఇక నవీన్ పోలిశెట్టి విషయానికి వస్తే అతనో సాఫ్ట్ వేర్ ఇంజనీరని తెలిసింది. స్టాండ్ అప్ కామెడీలు ట్రై చేస్తూ రెండు రకాల షేడ్స్ ని చూపిస్తారని వినికిడి. మరి ఆ చెఫ్ కి ఇతనికి కనెక్షన్ ఎలా కుదిరిందనేదే అసలు పాయింట్ గా చెబుతున్నారు. అనుష్క ఇంకా రెగ్యులర్ షూట్ లో పాల్గొనలేదు. వచ్చే నెల నుంచి షెడ్యూల్ చేశారు. తను లేని భాగంతో ఆల్రెడీ కొంత టాకీ పార్ట్ పూర్తయ్యింది. నెక్స్ట్ కాంబినేషన్ సీన్లు చేయబోతున్నారు. మిర్చి, భాగమతి నిర్మించిన యువితోనే అనుష్క జట్టు కట్టడం గమనార్హం. వేరే బ్యానర్లు దర్శకులు కలుస్తున్నా ఆఫర్లను ఒప్పుకోవడం లేదు. పైన చెప్పిన సినిమా ఈ ఏడాది చివర్లోనే విడుదల కావొచ్చు

ఇది కాకుండా మరో వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ డెబ్యూని అనుష్క చేయబోతోంది. దానికి సంబంధించిన వివరాలు రావాల్సి ఉంది. ఎల్లుండి విడుదల కాబోయే ఆచార్యలో ఒక చిన్న క్యామియో చేసినట్టు లీక్ వచ్చింది కానీ అది నిజమో కాదో తెలుసుకోవాలంటే శుక్రవారం దాకా వేచి చూడాలి. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ పెళ్లి ఎప్పుడంటే మాత్రం స్వీటీ దాటవేస్తూనే వచ్చింది. ఇప్పటికీ క్లారిటీగా చెప్పడం లేదు. ఎన్నేళ్లు ఇంకా బ్యాచిలర్ గా ఉంటావని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మొన్నామధ్య ఆర్ఆర్ఆర్ సక్సెస్ పార్టీలో కనిపించిన అనుష్క వెయిట్ పరంగా మరీ ఎక్కువ తగ్గినట్టు కనిపించలేదు. మరి ఎలా మేనేజ్ చేస్తుందో చూడాలి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio