iDreamPost
android-app
ios-app

సావిత్రి పరువు నిలబెట్టిన ANR! నదిలో పడిపోతే వెంటనే!

  • Published Feb 09, 2024 | 4:38 PM Updated Updated Feb 09, 2024 | 4:38 PM

ANR Saved Savitri: సినిమా షూటింగ్స్ లో నటీనటులకు అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతుంటాయి.. అలాంటి ఘటనే అప్పట్లో మూగమనసులు సినిమా షూటింగ్ లో మహానటి సావిత్రికి జరిగింది.

ANR Saved Savitri: సినిమా షూటింగ్స్ లో నటీనటులకు అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతుంటాయి.. అలాంటి ఘటనే అప్పట్లో మూగమనసులు సినిమా షూటింగ్ లో మహానటి సావిత్రికి జరిగింది.

సావిత్రి పరువు నిలబెట్టిన ANR! నదిలో పడిపోతే వెంటనే!

తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అపురూప చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. అలాంటి చిత్రాల్లో ఎప్పటికీ మరువలేని చిత్రం ‘మూగమనసులు’. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ఏఎన్ఆర్, సావిత్రి, జమున ముఖ్యభూమిక పోషించారు. ఈ చిత్రం 1964 లో రిలీజ్ అయ్యింది. పునర్జన్మ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం చూసి ప్రేక్షకులు గొప్ప అనుభూతి పొందారు. అంతస్తుల కారణంగా విడిపోయిన జంట మరో జన్మలో వివాహం చేసుకొని కలవడం కథాంశం. అప్పట్లో సినిమా షూటింగ్స్ చాలా వరకు మద్రాస్ లోని వివిధ స్టూడియోల్లో చిత్రీకరించేవారు.. కానీ ఈ మూవీ మాత్రం భద్రాచలంలో, దవళేశ్వరం వరకు ఉన్న గోదావరి పరిసర ప్రాంతంలో తీశారు. షూటింగ్ సమయంలో ఓ ప్రమాదం జరిగింది.. ఆ సమయంలో ఏఎన్ఆర్ చేసిన పనికి అందరూ ప్రశంసించారు.. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు ఆయన్ని ప్రశంసించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ లో ఎవర్ గ్రీన్ గా నిలిచినపోయిన సినిమాల్లో ఒకటి ‘మూగమనసులు’. ఈ చిత్రంలో పాటలు ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటాయి. ఆదుర్తి సుబ్బారెడ్డి మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆదుర్తి సుబ్బారావు డైరెక్షన్ లో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జమున ఈ చిత్రంలో తమ నటనతో అద్భుతాన్ని సృష్టించారు. గోదావరిపై జరిగిన పడవ ప్రమాదాలను తట్టుకొని ఈ చిత్రం ఘటన విజయం సాధించింది. ఏకంగా 175 రోజులు అడి రికార్డులు క్రియేట్ చేసింది. మూగమనసులు షూటింగ్ గోదావరి మీద జరుగుతున్న రోజులవి.. ఏఎన్ఆర్, సావిత్రి పై ‘ఈనాటి ఈ బంధమేనాటితో’ అనే పాటను లాంచ్ పై షూట్ చేస్తున్నార. ఆదుర్తి సుబ్బారావు డైరెక్షన్ చేస్తున్నారు.. పీఎల్ రాయ్ కెమెరాతో చిత్రీకరిస్తున్నారు. అదే సమయంలో సావిత్రి ఓ పక్కకకు వంగి అభినయం చేస్తున్న సమయంలో లాంచ్ కి సంబంధించిన ప్రోఫెల్లర్ కు చీర కొంగు చిక్కడంతో ప్రమాదం జరిగింది. దాంతో లాంచ్ మీదనుంచి గోదావరిలో పడిపోయారు సావిత్రి.

లాంచ్ లో ఉన్న అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.. అయితే సావిత్రి సమయస్ఫూర్తితో మునిగిపోకుండా లాంచ్ అంచును పట్టుకొని వేలాడారు. వెంటనే లాంచ్ ఆగిపోయింది. పడవలో ఉన్న యూనిట్ సభ్యులు ఆమెను రక్షించే పనిలో భాగంగా తాడు అందించారు. తాడు అందుకున్న సావిత్రి పైకి మాత్రం రావడం లేదు. దీంతో మళ్లీ టెన్షన్ పడ్డారు చిత్ర యూనిట్. రండమ్మా త్వరగా రండి అంటూ కేకలు వేశారు. కానీ.. ఆమె మాత్రం పైకి రావడం లేదు. అదే సమయంలో పరిస్థితి గమనించిన నాగేశ్వరరావు లాంచ్ లోని ఓ మూల ఉన్న కేన్వాస్ పట్టాను సావిత్రికి అందించారు. ఆ కాన్వాస్ చుట్టుకొని ఆమె బయటకు వచ్చారు. ప్రమాదంలో ఆమె చీర మొత్తం ప్రొఫెల్లర్ కి చుట్టుకుపోయింది. అందుకే ఆమె నీటిలో నుంచి పైకి రావడానికి ఇబ్బంది పడ్డారు.. ఆ సమయానికి ఏఎన్ఆర్ ఆమెకు కాన్వాస్ పట్టాను ఎందుకు అందించారో చిత్ర యూనిట్ కి అప్పుడు అర్థమైంది. అలా ఏఎన్ఆర్, సావిత్రి పరువు నిలబెట్టడంతో అందరూ ఆయనను ప్రశంసించారు. ఈ విషయం గురించి ఇండస్ట్రీలో చాలా ఏళ్లు చర్చించుకున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.