iDreamPost
android-app
ios-app

కిరణ్ అబ్బవరం మరో సినిమా.. ఈసారి ఆమె లక్ మార్చేనా?

ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన నటుడు కిరణ్ అబ్బవరం. సూపర్ టాలెండ్ గయ్.. గత ఏడాది మూడు సినిమాలతో అలరించాడు.. కానీ అవేవి ప్రేక్షకుల అంచనాలు అందుకోలేదు. ఇప్పుడు.. మరో లవ్ స్టోరీతో రాబోతున్నాడు.

ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన నటుడు కిరణ్ అబ్బవరం. సూపర్ టాలెండ్ గయ్.. గత ఏడాది మూడు సినిమాలతో అలరించాడు.. కానీ అవేవి ప్రేక్షకుల అంచనాలు అందుకోలేదు. ఇప్పుడు.. మరో లవ్ స్టోరీతో రాబోతున్నాడు.

కిరణ్ అబ్బవరం మరో సినిమా.. ఈసారి ఆమె లక్ మార్చేనా?

పక్కా లోకల్ కుర్రాడిగా, పక్కింటి అబ్బాయిగా కనిపిస్తుంటాడు కిరణ్ అబ్బవరం. తన భాష, మాట తీరు, నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంటాయి. షార్ట్ ఫిల్మిమ్స్ సుండి హీరోగా మారాడు. రాజావారు రాణివారు సినిమాతో గుర్తింపు పొందాడు. కానీ కిరణ్ అనే ఓ హీరో ఇండస్ట్రీలో ఉన్నాడు అని తెలియజేసేలా చేసిన మూవీ ఎస్ఆర్ కళ్యాణ మండపం. ఈ సినిమా కమర్షియల్‌గా మంచి సక్సెస్ ఇవ్వడమే కాకుండా.. అతడికి హీరోగా మంచి బూస్టర్ అయ్యింది. సెబాస్టియన్ పీఎస్ మెప్పించలేకపోయింది కానీ.. ఆ వెంటనే వచ్చిన సమ్మతమే మూవీ అతడ్ని మంచి హీరోగా నిలబెట్టింది.  ఆ తర్వాతే వచ్చిన నేను మీకు బాగా కావాల్సిన వాడిని థియేటర్లకు తీసుకురాలేకపోయాయి.

గత ఏడాది మూడు సినిమాలతో పలకరించాడు కిరణ్. వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్ సినిమాలను ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయాయి. రూల్స్ రంజన్.. ‘సమ్మోహనుడా.. పెదవిస్తా నీకే కొంచం కోరుక్కోవా’ పాట ఎంత సక్సెస్, ట్రెండింగ్ అయ్యిందే.. మూవీ మాత్రం నిరాశపర్చింది. ఈ సినిమా కూడా అతడికి ఆశించిన ఫలితమైతే ఇవ్వలేదు. కొంచెం గ్యాప్ ఇచ్చి.. ఇప్పుడు కొత్త మూవీని స్టార్ చేశాడు.. ఈ ఆంధ్ర అందగాడు. తన తదుపరి సినిమా ఫిక్స్ అయ్యింది. దిల్ రుబా అనే మూవీ చేయబోతున్నాడు కిరణ్ అబ్బవరం. ఇందులో అతడికి జోడి కట్టబోతుంది రుక్సార్ థిల్లాన్. ఈ సినిమాతో కరుణ అనే యువకుడు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ ఏడాది సమ్మర్‌లో రిలీజ్ కాబోతుంది.

ఈ టైటిల్ చూస్తుంటేనే.. ఇదొక లవ్ స్టోరీ మూవీగా కనిపిస్తోంది. సరిగమ మ్యూజిక్ ఈ సినిమాను నిర్మిస్తోంది. డ్యాన్సు, ఫైట్స్, నటనతో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్న కిరణ్ అబ్బవరం.. స్టార్ హీరో అయ్యేందుకు అన్నీ క్వాలిటీస్ ఉన్నా కథల ఎంపికలో చతికిల పడుతున్నాడన్న అపవాదు ఉంది.  పెద్ద పెద్ద బ్యానర్లలోనే అతడికి హీరోగా ఛాన్సులు వచ్చాయి. కానీ హిట్స్ రావడం లేదు.  మళ్లీ ఎస్ఆర్ కళ్యాణ మండపం, సమ్మతమే లాంటి హిట్స్ అతనికి చాలా అవసరం. మరి ఈ హీరోయిన్ అతడి లక్ మారుస్తుందేమో  చూడాలి. ఇక ఈ సినిమా తర్వాత గ్రామీణ నేపథ్యంలో నడిచే మరో కథలో నటించబోతున్నాడు మన రాయచోటి కుర్రాడు. సందీప్ – సుజీత్ అనే దర్శక ద్వయంతో కలిసి పనిచేస్తున్నాడు. 1980 కాలంలో నడిస్తుందట ఈ కథ.