nagidream
Another Culprit Responded: చైల్డ్ అబ్యూస్ కేసులో ఇరుక్కున్న ప్రణీత్ హనుమంతు మరియు అతని స్నేహితులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉచ్చు బిగుస్తుండడంతో ఒక్కొక్కరూ వీడియోలు విడుదల చేస్తున్నారు. మొన్న ప్రణీత్ వీడియో రిలీజ్ చేయగా.. తాజాగా మరో నిందితుడు వీడియో రిలీజ్ చేశాడు.
Another Culprit Responded: చైల్డ్ అబ్యూస్ కేసులో ఇరుక్కున్న ప్రణీత్ హనుమంతు మరియు అతని స్నేహితులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉచ్చు బిగుస్తుండడంతో ఒక్కొక్కరూ వీడియోలు విడుదల చేస్తున్నారు. మొన్న ప్రణీత్ వీడియో రిలీజ్ చేయగా.. తాజాగా మరో నిందితుడు వీడియో రిలీజ్ చేశాడు.
nagidream
ప్రణీత్ హనుమంతు అలియాస్ ఫన్ మంతు వివాదం గురించి అందరికీ తెలిసిందే. చైల్డ్ అబ్యూస్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇతనితో పాటు మరో ముగ్గురు నిందితులు కూడా ఉన్నారు. వీరిపై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. చర్యలు కూడా తీసుకునేందుకు సిద్ధమయ్యారు. వీళ్ళు అమెరికాలో ఉండడం వల్ల మన పోలీసులు అక్కడి పోలీసుల సాయంతో కేసులు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే ప్రణీత్ హనుమంతు వివాదం పెద్ద ఎత్తున దుమారం రేపడంతో ఈ వీడియో చేసిన నిందితుల్లో ఒకరైన ప్రణీత్ హనుమంతు స్పందించాడు. తనను తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని.. తాము మాట్లాడిన మాటలను వక్రీకరిస్తున్నారంటూ కామెంట్స్ చేశాడు. దీంతో ఇతనిపై మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.
తాజాగా ఈ వివాదంలో ఇరుక్కున్న మరో నిందితుడు డల్లాస్ నాగేశ్వరరావు సైతం స్పందించాడు. తనకు చాలా భయమేస్తుందని.. తాను అసలు అలాంటి వ్యక్తిని కాదని.. ఆ వీడియోలో కూడా ఒక్క మాట కూడా అనలేదంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు ఒక వీడియోను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు.
యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లో సర్క్యులేట్ అవుతున్న వీడియోలో ఉన్న నలుగురిలో నేను ఒకడిని. ఆ వీడియోలో తనను చూసి సె*క్స్ ప్రిడేటర్ అని, చైల్డ్ అబ్యూస్ చేస్తా అని అంటున్నారు. కానీ నేను అది కాదు. ఆ వీడియోలో కూడా నేను ఒక మాట అనలేదు. ఆ వీడియోలో ఒక మాట అనలేదు కాబట్టి నా తప్పు లేదు అని నేను అనడం లేదు. నేను బయటకు వెళ్లిపోకుండా.. ఆపకపోవడం, తప్పు జరుగుతున్నా ఆపకపోవడం, అక్కడే ఉండి ఏమీ అనకపోవడం వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు అనిపించింది. కానీ నాకు ఎప్పుడూ ఆ దృష్టి లేదు.
ఈ టైంలో నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. నన్ను చైల్డ్ అబ్యూసర్ అంటే నాకు ఏం తెలియడం లేదు. ఒక్కరి ఫ్యామిలీని కూడా ఏమీ అనలేదు. ఇది ఇటు పోతుందో కూడా తెలియడం లేదు. నాకు చాలా భయమేస్తుంది. నన్ను క్షమించండి. నేను ఏమీ అనలేదు కదా అని అనను. వాళ్ళని ఆపకపోవడం నా తప్పే. అందుకు నన్ను క్షమించండి. అది రాంగ్ ప్లేస్, రాంగ్ టైం’ అంటూ ఒక వీడియోను పోస్ట్ చేశాడు. మరి డల్లాస్ నాగేశ్వరరావు చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.