iDreamPost
android-app
ios-app

‘జైలర్’ జాక్​పాట్.. అనిరుధ్​కు లగ్జరీ కారు గిఫ్ట్.. నెక్స్ట్ ఆయనకేనా?

  • Author singhj Published - 11:13 AM, Tue - 5 September 23
  • Author singhj Published - 11:13 AM, Tue - 5 September 23
‘జైలర్’ జాక్​పాట్.. అనిరుధ్​కు లగ్జరీ కారు గిఫ్ట్.. నెక్స్ట్ ఆయనకేనా?

‘జైలర్’ సినిమాతో తన స్టామినా ఏంటో మరోమారు చూపెట్టారు తలైవా రజినీకాంత్. సౌతిండియన్ బాక్సాఫీస్​ను ఈ మూవీ షేక్ చేసింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళంలో సినిమాతో బిజినెస్​లో ఉన్న వారికి రూ.కోట్లలో లాభాలు తీసుకొచ్చింది. రజినీకి హిట్ పడితే ఈ లెవల్లో ఉంటదా అనే రీతిలో ‘జైలర్’కు వసూళ్లు ఉన్నాయి. ఆగస్టు 10వ తేదీన రిలీజైన ఈ చిత్రం ఇప్పటికే రూ.600 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ తప్పితే ఏ భాషలోనూ ‘జైలర్​’ మూవీకి ప్రమోషన్స్ చేయలేదు. అయినా మౌత్ టాక్, రజినీ క్రేజ్, ‘కావాలయ్యా సాంగ్​’తో ఈ సినిమా కోసం ఆడియెన్స్​ థియేటర్లకు క్యూ కట్టారు.

‘జైలర్’లో అనిరుధ్ బీజీఎం, రజినీకాంత్ స్టైలిష్ యాక్టింగ్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ మేకింగ్ అందర్నీ ఆకట్టుకున్నాయి. సినిమాను మళ్లీ మళ్లీ చూసేందుకు ప్రేక్షకులు ఉత్సాహం చూపించారు. దీంతో తలైవా మూవీకి కనకవర్షం కురిసింది. ‘జైలర్’ ఇంత మెగా హిట్ సాధించడంతో మూవీ టీమ్ ఫుల్ జోష్​లో ఉంది. విజయోత్సవంలో భాగంగా సినిమా నిర్మాత కళానిధి మారన్ ఇప్పటికే హీరో రజినీకాంత్​కు విలువైన కారును బహుమతిగా ఇచ్చారు. డైరెక్టర్‌‌ నెల్సన్​కు కూడా కారును గిఫ్ట్​గా ఇచ్చారు. దీంతో పాటు మూవీ లాభాల నుంచి కొంత మొత్తాన్ని ఆయనకు చెక్ రూపంలో అందించారు.

రజినీకాంత్, నెల్సన్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్​ వంతు వచ్చింది. ‘జైలర్’ సక్సెస్​లో ఈ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ పాత్ర చాలా కీలకమనే చెప్పాలి. ఆయన అదిరిపోయే బ్యాగ్రౌండ్ మ్యూజిక్​తో పాటు చార్ట్​బస్టర్లుగా నిలిచిన ‘కావాలయ్యా’, ‘హుకుం’ పాటలను అందించారు. దీంతో సినిమా విజయంలో అనిరుధ్​కు కూడా షేర్ ఇచ్చారు నిర్మాత కళానిధి మారన్. అనిరుధ్​ను కలసి ఆయనకు ఒక చెక్​ను అందజేశారు. అలాగే ఖరీదైన పోర్షే మకాన్ కారును కూడా గిఫ్ట్​గా ఇచ్చారు. రజినీ, నెల్సన్, అనిరుధ్​లకు బహుమతులు అందజేసిన నిర్మాత.. నెక్స్ట్ విలన్ క్యారెక్టర్​లో యాక్ట్ చేసిన వినాయకన్​కు గిఫ్ట్ ఇస్తారని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇదీ చదవండి: ఫస్ట్ టైమ్ తిరుమలకు వచ్చిన షారుక్!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet