Nidhan
Animal: ‘యానిమల్’ సినిమా ద్వారా చాలా మంది గుర్తింపు సంపాదించారు. అందులో ఓ పాత్రలో నటించిన సర్దార్జీ ఒక అమ్మాయి ప్రాణాలను కాపాడాడు. దీనికి సంబంధించిన పూర్తి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Animal: ‘యానిమల్’ సినిమా ద్వారా చాలా మంది గుర్తింపు సంపాదించారు. అందులో ఓ పాత్రలో నటించిన సర్దార్జీ ఒక అమ్మాయి ప్రాణాలను కాపాడాడు. దీనికి సంబంధించిన పూర్తి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
పాత్ బ్రేకింగ్స్ మూవీస్ ఎప్పుడో ఒకటి వస్తుంటాయి. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో అప్పట్లో వచ్చిన ‘శివ’ అలాంటి మూవీనే. కింగ్ నాగార్జునను స్టార్‌ను చేసిందీ సినిమా. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ‘అర్జున్ రెడ్డి’ కూడా పాత్ బ్రేకింగ్ ఫిల్మ్స్ కోవలోకే వస్తుంది. ఈ చిత్రాన్ని తీసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తక్కువ టైమ్‌లోనే మళ్లీ ఓ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌ను అందించారు. అదే ‘యానిమల్’. గతేడాది ఆఖర్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. రణ్‌బీర్ కపూర్ హీరోగా వచ్చిన ఈ మూవీ రూ.800 కోట్ల పైచిలుకు వసూళ్లతో సంచలనం సృష్టించింది. ఇద్దరు తండ్రీ కొడుకుల మధ్య ప్రేమకు సంబంధించిన కథతో ఈ సినిమాను సందీప్ రెడ్డి తనదైన స్టైల్లో తెరకెక్కించారు. అటు హిందీతో పాటు ఇటు తెలుగులోనూ ఈ మూవీ బిగ్ హిట్‌గా నిలిచింది. ‘యానిమల్’లో నటించిన యాక్టర్స్‌లో కొంతమంది బాగా పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో ఒకడైన మన్జోత్ సింగ్ ఒక అమ్మాయిని కాపాడాడు.
తాను చదువుకుంటున్న కాలేజ్‌లో ప్రాణాలు తీసుకోవాలని డిసైడ్ అయిన ఓ 18 ఏళ్ల యువతిని కాపాడాడు మన్జోత్. బిల్డింగ్ పైనుంచి దూకేందుకు ఆమె ప్రయత్నించింది. ఈ సమయంలో అక్కడే ఉన్న మన్జోత్ పక్క గోడ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. దూకుతున్న యువతి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. దీంతో అతడికి సాయం చేసేందుకు మరికొందరు యువకులు అక్కడికి చేరుకున్నారు. వారి హెల్ప్‌తో ఆ యువతిని మన్జోత్ పైకి తీసుకొచ్చాడు. ప్రాణాలు తీసుకోవాలనుకున్న యువతిని ‘యానిమల్’ యాక్టర్ కాపాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మన్జోత్ ధైర్య సాహసాలకు, హెల్ప్ చేయాలనుకునే గుణాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. ఇలాంటి వాళ్ల అవసరం సమాజానికి ఎంతో ఉందని ప్రశంసిస్తున్నారు.
కాగా, మన్జోత్ అమ్మాయిని కాపాడిన వీడియో ఇప్పటిది కాదు. అది అతడి కాలేజ్ టైమ్‌లోది. గ్రేటర్ నోయిడాలోని శారదా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ టైమ్‌లో అతడు కాపాడిన అమ్మాయిని తర్వాత శారదా హాస్పిటల్లో చేర్పించారు. తల్లితో గొడవ కారణంగానే ఆమె ప్రాణాలు తీసుకోవాలని భావించింది. అయితే లాస్ట్ మూమెంట్లో మన్జోత్ వచ్చి రక్షించడంతో బతికిపోయింది. అనంతరం ఆ అమ్మాయికి కౌన్సెలింగ్ ఇప్పించారు. ఇక, అమ్మాయిని కాపాడినందుకు గానూ అప్పటి ఢిల్లీ సిఖ్ కమ్యూనిటీ ప్రెసిడెంట్ మంజీత్ సింగ్ జీకే మన్జోత్ను మెచ్చుకున్నారు. అంతేగాక సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యేందుకు అతడికి అయ్యే మొత్తం ఖర్చుల్ని భరిస్తామని హామీ ఇచ్చారు. మరి.. ‘యానిమల్’ యాక్టర్ సాహసంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ఈ యాడ్‌లో త్రిష కాకుండా.. ఓ స్టార్ హీరో ఉన్నాడు.. గుర్తు పట్టారా..?
Manjot Singh,23 yo boy doing https://t.co/9mkcPjvFIS saved life of girl who was attempting suicide in Sharda univ.Manjot do part time job as Bhangra coach to pay his fees. A group of sikh leaders promised to pay his coaching fees for civil services exam. pic.twitter.com/BjjhjIbYmA
— Arshdeep (@arsh_kaur7) August 3, 2019