Krishna Kowshik
టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్లలో ఒకరు అనిల్ సుంకర. దూకుడు నుండి సరిలేరు నీకెవ్వరూ సూపర్ డూపర్ హిట్ మూవీస్ అందించాడు. అయితే కొన్ని రోజుల నుండి సక్సెస్ అతడిని పలకరించడం లేదు. అయినప్పటికీ.. సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. అయితే ఇటీవల..
టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్లలో ఒకరు అనిల్ సుంకర. దూకుడు నుండి సరిలేరు నీకెవ్వరూ సూపర్ డూపర్ హిట్ మూవీస్ అందించాడు. అయితే కొన్ని రోజుల నుండి సక్సెస్ అతడిని పలకరించడం లేదు. అయినప్పటికీ.. సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. అయితే ఇటీవల..
Krishna Kowshik
సినిమా ఇండస్ట్రీల్లో బడా నిర్మాతల్లో ఒకరిగా ఉన్నారు అనిల్ సుంకర. సూపర్ హిట్ సినిమాలను అందిస్తూ.. పరిశ్రమలో మంచి నిర్మాతగా ఎదిగారు. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మాతల్లో ఒకరిగా అభిరుచి కలిగిన సినిమాలను అందించారు. అయితే రెండేళ్ల నుండి అతడి నిర్మించిన మూవీస్ వరుస పెట్టి బెడిసికొట్టాయి. మహేష్ బాబుతో వచ్చిన సరిలేరు నీకెవ్వరూ తర్వాత వచ్చిన బంగారు బుల్లోడు, మహా సముద్రం, ఏజెంట్, భోళా శంకర్ భారీ డిజాస్టర్లుగా మిగిలాయి. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడుతూనే ఉన్నారు. అయితే హిట్ ఉంటేనే ఇండస్ట్రీలో గుర్తింపు.. లేకుంటే వారిని పక్కన పడేస్తారని ఇప్పుడు మరోసారి నిజమైంది అనిల్ సుంకర విషయంలో. ఇంతకు అసలు ఏమైందనుకుంటున్నారా..?
సంక్రాంతి బరిలోకి ఐదు టాలీవుడ్ సినిమాలు పోటీ పడుతుండగా.. అనూహ్యంగా రవితేజ మూవీ ఈగల్ తప్పుకుంది. దీని వెనుక చర్చలు జరిగాయని తెలుస్తోంది. ఆ తర్వాతే ఈ సినిమా వాయిదా పడింది. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ధమాకా తర్వాత రవితేజతో రెండో మూవీని తెరకెక్కించింది నిర్మాణ సంస్థ. తీవ్రమైన పోటీ ఉన్న సంక్రాంతి బరిలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్ర యూనిట్. కానీ అనూహ్యంగా ఈ రేసు నుండి వైదొలిగింది. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ తాజాగా ఎనౌన్స్ చేసింది. ఫిబ్రవరి 9న ఈ మూవీని విడుదల చేయబోతున్నారు. ఇదే అనిల్ ఆగ్రహానికి కారణమైంది. అదే తేదీకి టిల్లు స్క్వేర్, యాత్ర 2, ఊరి పేరు భైరవ కోన మూవీస్ విడుదల కాబోతున్నాయి. ఊరి పేరు భైరవ కోన మూవీకి అనిల్ సుంకర నిర్మాత.
సంక్రాంతి మూవీలో ఐదు మూవీలు విడుదల కావడంతో ఇండస్ట్రీకి మంచిది కాదని భావించిన పెద్దలు.. దిల్ రాజు నేతృత్వంలో చర్చలు జరిపారు. ఎట్టకేలకు సక్సెస్ అయ్యి.. ఈగల్ మూవీ తప్పుకుంది. అదే సమయంలో నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తోన్న టిల్లు స్వ్కేర్ డేట్ వెనక్కు తీసుకోవడానికి ఒప్పుకున్నట్లు దిల్ రాజు చెప్పుకొచ్చారు. అయితే ఆ రోజు యాత్ర 2 రాబోతుంది. ఇది ఏపీ రాజకీయాలకు సంబంధించిన కీలక నేత బయోపిక్. ఈ మూవీతో పోటీ ఎందుకు అనుకున్నారట. అలాగే గుంటూరు కారం విషయంలో ఏపీలో టికెట్లు పెంపుపై యువీ వంశీ సహాయం కోరారట. దాని వల్లే కూడా టిల్లు స్క్వేర్ వాయిదా వేసుకున్నారట. అలాగే యువీ వంశీతో పీపుల్స్ మీడియాకు మంచి సంబంధాలున్నాయి.
పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్‌కు జన సేన నేతలు పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ తో సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో కావాలనే యాత్ర 2 కు పోటీగా ఈగల్ తీసుకు వస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదైమైనా ఈ క్విడ్ ప్రోకో విధానం బానే ఉంది కానీ.. ఆ రోజు విడుదల అవుతున్న అనిల్ సుంకరను దిల్ రాజు పూర్తిగా పక్కన పెట్టేసినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే.. ఈగల్ మూవీ విడుదల కోసం నాగవంశీ, యువీ వంశీని దిల్ రాజు సంప్రదించారు కానీ.. అదే రోజు రిలీజ్ అవుతున్న సహ నిర్మాత అనిల్ సుంకర గురించి ప్రస్తావించలేదు. అతడిని సంప్రదించలేదని తెలుస్తోంది. ఇదే అనిల్ ను బాధపెట్టిందట. సన్నిహితుల దగ్గర ఈ విషయంపై ఆవేదన వ్యక్తం చేశారని టాక్ నడుస్తోంది. తనను సంప్రదించనప్పుడు.. తన మూవీ ఎందుకు వాయిదా వేసుకోవాలి.. ఆరోజే సినిమా విడుదల చేస్తానని అంటున్నారట అనిల్. మరీ ఏమౌతుందని అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.