iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ 8లో పాల్గొనడంపై క్లారిటీ ఇచ్చిన విష్ణుప్రియ!

Vishnupriya Bhimeneni: నటి విష్ణుప్రియ గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.  ఈ అమ్మడు బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ లోకి  ఎంట్రీ అంటూ నెట్టింట ప్రచారం జరగుతోంది. దీనిపై తాజాగా విష్ణుప్రియ స్పందించారు.

Vishnupriya Bhimeneni: నటి విష్ణుప్రియ గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.  ఈ అమ్మడు బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ లోకి  ఎంట్రీ అంటూ నెట్టింట ప్రచారం జరగుతోంది. దీనిపై తాజాగా విష్ణుప్రియ స్పందించారు.

బిగ్ బాస్ 8లో పాల్గొనడంపై క్లారిటీ ఇచ్చిన విష్ణుప్రియ!

తెలుగు బుల్లితెరపై ఎన్నో  షోలు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తుంటాయి. అలాంటి వాటిల్లో బిగ్ బాస్ రియాల్టీ షో ఒకటి. ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో త్వరలో ఎనిమిద సీజన్ ప్రారంభం కానుంది. అయితే  ఈ సీజన్లో పాల్గొన్ని కంటెస్టెంట్లు ఎవరు అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే తరచూ కొందరి పేర్లు మాత్రం  సోషల్ మీడియాలో వినిపిస్తుంటాయి. అలానే ఫేమస్ యాంకర్ విష్ణుప్రియా, అలానే రీతు చౌదరి కూడా బిగ్ బాస్ సీజన్ 8లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని టాక్ వినిపించింది. ఇది ఇలా ఉంటే తాజాగా బిగ్ బాస్ లోకి తన ఎంట్రీ అంటూ వస్తున్న వార్తలపై విష్ణు ప్రియ స్పందించారు.

యాంకర్, నటి విష్ణుప్రియ గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.  అనేక షోల్లో తనదైన మాటలతో , పంచులతో అందరిని ఎంటర్ టైన్ చేస్తుంది. అలానే సోషల్ మీడియాలో సైతం ఈ బ్యూటీ యాక్టీవ్ గా ఉంటుంది.  తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది.  ఇది ఇలా ఉంటే.. ఈ అమ్మడు బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ లోకి  ఎంట్రీ అంటూ నెట్టింట ప్రచారం జరగుతోంది.  ఈ ఊహాగానాలపై తాజాగా విష్ణుప్రియ స్పందించింది. బిగ్ బాస్ లోకి తాను వెళ్తే.. పది కేజీల బరువు తగ్గుతానని తనకు నమ్మకం ఉందన్నారు. తనకు బిగ్ బాస్ లోకి వెళళ్డం అస్సలు ఇష్టం లేదని, కానీ ఎందరో ప్రేక్షకుల దీవెనల వల్ల రియాల్టీ షోలో అడుగుపెడతానేమోనని భయమేస్తోందని తెలిపింది.   చాలా మంది తనను  బిగ్ బాస్ షోలో చూడాలని అనుకుంటున్నారని, వారి కోరికలను విని దేవతలు తథాస్తు అంటే తప్పకుండా తను బిగ్ బాస్ లో చూస్తారంటూ చెప్పుకొచ్చింది.

ఇక విష్ణు ప్రియ విషయానికి వస్తే.. చాలా కష్టపడి ఎదిగిన వారిలో ఆమె ఒకరు. షార్ట్ ఫిల్మ్ నటిస్తూ తన కెరీర్ ను ప్రారంభించింది. ఆ తరువాత బుల్లితెరపై పలు షోలకు యాంకర్ గా వ్యవహరించింది. సుడిగాలి సుధీర్ చేసిన పోవేపోరా షో ద్వారా విష్ణుప్రియాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత కూడా అనేక ఆఫర్లు వచ్చి..పలు షోల్లో సందడి చేసింది. పండగలు, ఇతర వేడుకల సమయంలో ఏర్పాటు చేసే టీవీ షోల్లో సైతం విష్ణుప్రియ పాల్గొన్ని ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తుంది. అలానే వెండితెరపై కూడా కొన్ని సినిమాల్లో మెరిసింది. సోషల్ మీడియాలో సైతం తన గ్లామర్ ఫోటోలను, డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తుంది. తాజాగా బిగ్ బాస్ లోకి తన ఎంట్రీపై విష్ణుప్రియ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.