iDreamPost
android-app
ios-app

Anchor Suma: వీడియో: పెరిగిపోతున్న కుమారి ఆంటీ క్రేజ్.. ఏకంగా యాంకర్ సుమానే..

  • Published Feb 08, 2024 | 9:18 PM Updated Updated Feb 09, 2024 | 12:10 PM

కుమారి ఆంటీపై వచ్చిన DJ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ పాటను రీమిక్స్ చేసింది స్టార్ యాంకర్ సుమ. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.

కుమారి ఆంటీపై వచ్చిన DJ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ పాటను రీమిక్స్ చేసింది స్టార్ యాంకర్ సుమ. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.

  • Published Feb 08, 2024 | 9:18 PMUpdated Feb 09, 2024 | 12:10 PM
Anchor Suma: వీడియో: పెరిగిపోతున్న కుమారి ఆంటీ క్రేజ్.. ఏకంగా యాంకర్ సుమానే..

కుమారి ఆంటీ.. గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగుతున్న పేరు. నాణ్యమైన భోజనాన్ని అందుబాటు ధరలో అందిస్తూ హైదరాబాద్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆమె. అయితే కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో.. ఆమె స్టాల్ ను మూసేశారు పోలీసులు. ఇక ఇక్కడి నుంచి మెుదలైన కుమారి ఆంటీ క్రేజ్.. ఏకంగా బిగ్ బాస్, నెట్ ఫ్లిక్స్ దాకా పాకిందన్న వార్తలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అదీకాక ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయగా ఆమె స్టాల్ ను సందర్శిస్తానని చెప్పడం, మద్ధతుగా నిలవడంతో.. కుమారి ఆంటీ క్రేజ్ మరింతగా విస్తరించింది. ఇక ఆమెపై డీజే పాట కూడా వచ్చింది. ఆ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా యాంకర్ సుమ సైతం ఆ సాంగ్ తో రీల్ ను చేసింది. అదిప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ట్రెండింగ్ కు తగ్గట్లుగా సోషల్ మీడియాను వాడుకోవడమే ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. ఇలాంటి వాటిల్లో ముందుంటారు కొందరు సెలబ్రిటీలు. వారిలో యాంకర్ సుమ ఒకరు. తన యాంకరింగ్ తో టాలీవుడ్ లో నెంబర్ వన్ గా కొనసాగుతూ వస్తోంది సుమ. బుల్లితెర షోల దగ్గర నుంచి మెుదలుపెడితే.. వెండితెర ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ల వరకు వినిపించే ఏకైక పేరు సుమ. యంకరింగ్ అంటే సుమ, సుమ అంటే యాంకరింగ్ గా మారిపోయింది. కాగా.. ఆమె షోల్లో పాల్గొనే సమయంలో షూటింగ్ గ్యాప్ లో రీల్స్ చేస్తూ ఉంటుంది. వాటిని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, అభిమానులను అలరిస్తూ వస్తోంది. తాజాగా ఓ ట్రెండింగ్ సాంగ్ తో దుమ్మురేపింది. లేటెస్ట్ సెన్సేషన్ కుమారి ఆంటీపై DJ సాంగ్ వచ్చి.. వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ సాంగ్ ను రీమిక్స్ చేసింది యాంకర్ సుమ. షూటింగ్ గ్యాప్ లో స్టాఫ్ తో లంచ్ టైమ్ లో ‘చికెన్ కర్రీ, తలకాయ, బోటీ, ఫిష్ కర్రీ.. రెండు లివర్లు ఎక్స్ ట్రా’ అంటూ కుమారి ఆంటీ డీజే సాంగ్ ను రీరీమిక్స్ చేసింది. ఇక ఇందులో నటుడు బ్రహ్మాజీని కూడా ఇన్ క్లూడ్ చేసింది సుమ. అద్భుతంగా ఎడిట్ చేసిన ఈ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది స్టార్ యాంకరమ్మ. ఈ సాంగ్ నెట్టింట రచ్చ లేపడంతో.. నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. సుమక్క నువ్వు కూడా ఫుడ్ స్టాల్ పెట్టావా? పాపం కుమారి ఆంటీ ఏమైపోవాలి? అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోకు డైరెక్టర్ సుకుమార్ భార్య కూడా రియాక్ట్ అయ్యారు. మరి సుమ ఈ సాంగ్ ను రీమిక్స్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదికూడా చదవండి: యాత్ర 2 డైలాగ్స్.. ఆడియన్స్ రెస్పాన్స్ కి థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి!

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet