iDreamPost

యాత్ర 2 డైలాగ్స్.. ఆడియన్స్ రెస్పాన్స్ కి థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి!

Yatra 2 Movie Dialogues: యాత్ర 2 సినిమా వరల్డ్ వైడ్ గా ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ మూవీలో ఉన్న టాప్ డైలాగ్స్ మీకోసం..

Yatra 2 Movie Dialogues: యాత్ర 2 సినిమా వరల్డ్ వైడ్ గా ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ మూవీలో ఉన్న టాప్ డైలాగ్స్ మీకోసం..

యాత్ర 2 డైలాగ్స్.. ఆడియన్స్ రెస్పాన్స్ కి థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి!

ఐదేళ్ల క్రితం రిలీజైన యాత్ర సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనంగా మారింది. ఆ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ ఏ స్టార్ హీరోకి దక్కలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి ఒక సూపర్ హిట్టు మూవీకి సీక్వెల్ గా వచ్చిందే యాత్ర 2 సినిమా. ఈ మూవీ కూడా మొదటి పార్ట్ రిలీజ్ అయిన అదే ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అందరికి ఈ మూవీ తెగ నచ్చేస్తోంది. ముఖ్యంగా ఎమోషన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా కొన్ని సీన్స్ అయితే ఆడియన్స్ ని కంటతడి కూడా పెట్టిస్తున్నాయి.

ఈ యాత్ర 2 సినిమా మొత్తం 2009 నుంచి 2019 వరకు జరిగిన యధార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రం. దివంగత నేత వైఎస్సార్ మరణం, అప్పటి ఏపీ రాజకీయాలు, జగన్ పాదయాత్ర, ఢిల్లీలో జగన్ చుట్టూ జరిగిన రాజకీయం వంటి ఘటనలను కళ్లకు కట్టినట్లు చూపించారు. డైరెక్టర్ చెప్పినట్లు అన్నీ అందరికీ తెలియవు. కొన్ని విషయాలు తెలిసినట్లే అనిపించినా.. వాటి లోతు తెలియాలి. అలాంటి ఎమోషనల్ సీన్స్ ఈ మూవీలో చాలానే ఉన్నాయి. మమ్ముట్టి, జీవా యాక్టింగ్, మహీ డైరెక్షన్ టాప్ నాచ్ లో ఉన్నాయి. ఈ విషయాలు పక్కన పెడితే ఈ మూవీలో డైలాగ్స్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఒక్కో డైలాగ్ కి ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. మరి.. యాత్ర 2 నుంచి అలాంటి మెస్మరైజింగ్ డైలాగ్స్ మీకోసం..

  • జగన్ సూసైడ్ బాంబర్ లాంటి వాడు.
    వాడు పోతూ.., మనలని తీసుకుని పోతాడు
  • కడపోళ్ళకి ఎండలు.. కష్టాలు కొత్త కావు
  • నాయకులకి తెలిసినంతగా
    కార్యకర్తలకి రాజకీయాలు తెలియవు
  • రాజకీయాలు నాయకులకే
    కార్యకర్తలకు తెలియవు
  • పిల్లిని అడవి లో వదిలినా అది పిల్లే
    పులిని బోనులో పెట్టినా అది పులే సర్
  • మనం పోరాడుతున్నది చంద్రబాబుతో
    ఆయన్ని తక్కువ అంచనా వేయద్దు
  • గెలిచిన వాడు నిద్రపోవచ్చు
    గెలవాలి అనుకునే వాడు కాదు
  • సార్.. పిల్లలు అందరికీ ఈ మిషన్స్ పెట్టించాలంటే రూ.200 కోట్లు ఖర్చు అవుద్ది
    YSR: డబ్బుది ఏముందయ్యా? ఏదో ఒక మూల నుండి వస్తాయి
    నేను సీఎంగా ఉండి కూడాఈ మంచి పని చేయకపోతే ఇక అధికారం ఎందుకు?
  • జగన్: నాకు ఏమైనా చెప్పాలా నాయనా?
    YSR: చుట్టూ చేరి జై కొట్టే నాయకులను నమ్ముకుని లీడర్ అవ్వాలని అనుకోకు జగన్
    జనం అవసరాలు తెలుసుకో, ఆ జనాన్నే నమ్ముకో
  • జగన్ రెడ్డి కడపోడు సర్
    శత్రువు మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని నిర్ణయించుకున్న తరువాత
    వాళ్ళు నాశనం అయిపోతారని తెలిసినా.. శత్రువుకి తల వంచరు సర్
  • పోలీసోల్లు ఎన్ని దెబ్బలు కొట్టినా న్యాయం వైపే నిలబడ్డావు సురేశ్
    ఏ పోలీస్ అయితే నిన్ను అవమానించాడో
    అదే పోలీస్ చేత నీకు సెల్యూట్ కొట్టిస్తాను
  • నేను విన్నాను.. నేను ఉన్నాను

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి