ఓనం వేళ! తోటి యాంకర్స్ అందరిని ఒక్కచోట చేర్చిన సుమ!

  • Author ajaykrishna Updated - 11:19 AM, Wed - 30 August 23
  • Author ajaykrishna Updated - 11:19 AM, Wed - 30 August 23
ఓనం వేళ! తోటి యాంకర్స్ అందరిని ఒక్కచోట చేర్చిన సుమ!

ఓనం వేళ.. ఇండియా మొత్తం గ్రాండ్ గా సెలెబ్రేషన్స్ జరుపుకున్నారు జనాలు. ఓనం అంటే ముఖ్యంగా కేరళలో సంప్రదాయ వేడుక. తెలుగు రాష్ట్రాలలో ఉగాది ఎలాగో.. కేరళ వారికి ఓనం అలా అన్నమాట. అయితే.. దేశవ్యాప్తంగా జనాలు ఎలా సెలెబ్రేట్ చేసుకుంటారో తెలియదు గానీ.. సెలబ్రిటీలు మాత్రం ఎలా జరుపుకున్నా ప్రేక్షకులకు ఇట్టే తెలిసిపోతుంది. ఎందుకంటే.. ఎలాంటి ఫెస్టివల్స్.. ఫ్యామిలీ ఈవెంట్స్ అయినా సెలబ్రిటీలే సోషల్ మీడియాలో అప్డేట్ చేస్తుంటారు. వారి సెలెబ్రేషన్స్ కి సంబంధించి ఫోటోలు, వీడియోలతో ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటారు. అయితే.. ఈసారి ఓనం ఫెస్టివల్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ.

సుమ.. కేరళ కుట్టి అని అందరికీ తెలిసిందే. కేరళ అమ్మాయి అయినప్పటికీ.. రాజీవ్ కనకాలతో ప్రేమలో పడి.. ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. ఇది కేరళ నుండి సుమ.. తెలుగు స్టేట్స్ లో అడుగు పెట్టిన కథ. అక్కడినుండి నటుడిగా రాజీవ్.. యాంకర్ గా సుమ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. ఇప్పుడు సుమ అంటే.. ఎలాంటి సినిమా ఈవెంట్స్, టీవీ ప్రోగ్రాంస్ ఏవైనా ఆ క్రేజ్ మాములుగా ఉండదు. అయితే.. కేరళ సంప్రదాయాన్ని గౌరవించే సుమ.. ప్రతీ ఏడాది ఓనం ఫెస్టివల్ ని తమ ఇంట్లో జరుపుకుంటుంది. ఈసారి కాస్త వెరైటీగా తెలుగు టాప్ యాంకర్స్ అందరిని ఆహ్వానించి.. వారందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. ప్రస్తుతం ఆ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఆ వివరాల్లోకి వెళ్తే.. ఓనం పండుగ సందర్బంగా తెలుగు టాప్ యాంకర్స్ అందరూ ఒకేచోట చేరారు. సుమ ఇంటికి యాంకర్స్ అంతా తరలివచ్చి.. సెలబ్రేట్ చేసుకున్నారు. యాంకర్ రవి, అనసూయ, రష్మీ లతో పాటు గీతా భగత్, శిల్పా చక్రవర్తి.. ఇలా తదితరులు కనిపించారు. అయితే.. వీరిలో యాంకర్ ప్రదీప్, శ్రీముఖి లాంటి కొందరు మిస్ అయినట్లు తెలుస్తోంది. సుమ ఓనం ఫెస్టివల్ ని.. కేరళ సంప్రదాయంలో అన్నిరకాల పూజలు.. కట్టుబొట్టు.. వంటకాలు.. చేసి ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంటుంది. ఇక లేటెస్ట్ వీడియోలో చూస్తే.. రాజీవ్ కనకాల అమ్మవారి దీక్షలో ఉన్నట్లు తెలుస్తోంది. భర్తకు నమస్కారం పెడుతూ సుమ వీడియోలో కనిపించింది. ఇక వీడియోలో అనసూయ, రష్మీ కూడా హైలైట్ అవుతున్నారు. మరి సుమ ఓనం సంబరాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Show comments