iDreamPost
android-app
ios-app

Anchor Suma: యాంకర్ సుమ సంచలన వ్యాఖ్యలు.. ’తప్పు చేశాను.. అందుకే ఇలా ప్రాయశ్చితం చేసుకుంటున్నాను‘

  • Published Apr 12, 2024 | 10:09 AM Updated Updated Apr 12, 2024 | 11:46 AM

యాంకర్ సుమా సంచలన వ్యాఖ్యలు చేసింది. తప్పు చేశాను.. అందుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది. అది వైరల్ అవుతోంది. ఆవివరాలు..

యాంకర్ సుమా సంచలన వ్యాఖ్యలు చేసింది. తప్పు చేశాను.. అందుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను అంటూ ఓ వీడియో పోస్ట్ చేసింది. అది వైరల్ అవుతోంది. ఆవివరాలు..

  • Published Apr 12, 2024 | 10:09 AMUpdated Apr 12, 2024 | 11:46 AM
Anchor Suma: యాంకర్ సుమ సంచలన వ్యాఖ్యలు.. ’తప్పు చేశాను.. అందుకే ఇలా ప్రాయశ్చితం చేసుకుంటున్నాను‘

తెలుగులో టాప్ యాంకర్ గా రాణిస్తున్న సుమ గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆమె నోరు తెరిస్తే చాలు.. మాటల ప్రవాహం గలగలా పారుతుంది. చక్కని రూపం.. తెలుగుదనం ఉట్టిపడేలా కట్టుబొట్టు.. అన్నింటికి మించి సమయస్ఫూర్తితో వ్యవహరించే తీరు.. పంచ్ డైలాగ్ లు ఇవన్ని సుమను టాలీవుడ్ లో టాప్ యాంకర్ గా నిలబెట్టాయి. ఇప్పటికే ఎందరో యాంకర్ లు వచ్చినా.. వారేవరూ సుమను ఢీకొట్టలేకపోయారు. నాలుగు పదుల వయసులో కూడా తెలుగులో నంబర్ వన్ యాంకర్ గా రాణిస్తుంది సుమ.

మలయాళీ అయిన సుమ.. రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకుని తెలుగు వారి కోడలు అయ్యింది. బుల్లితెర మీద ఆమెది సుదీర్ఘమైన కెరీర్. ప్రారంభంలో సీరియల్స్ లో నటించింది. సినిమాల్లో కూడా చేసింది. ఆ తర్వాత బుల్లితెరకు షిఫ్ట్ అయ్యింది. అనేక షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వస్తోంది. ఇక గత కొన్నాళ్లుగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా యాంకర్ గా చేస్తోంది సుమ. కెరీర్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికి సోషల్ మీడియాలో కూడా అదే స్థాయిలో యాక్టీవ్ గా ఉంటుంది సుమ. ట్రెండీ ఫొటో షూట్ లు చేయడమే కాక.. యూట్యూబ్ చానెల్ లో వీడియోలను కూడా అప్లోడ్ చేస్తూ.. ఆల్ ఇన్ వన్ గా రాణిస్తుంది. తాజాగా సుమ ఒక ఆసక్తికర వీడియో షేర్ చేసింది. సదరు వీడియోలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తప్పు చేశాను అందుకు పశ్చాత్తాప పడుతున్నాను.. ప్రాయశ్చిత్తం కోసం ఇదుగో ఇలా చేస్తున్నాను అంటూ సీరియస్ కామెంట్స్ చేసి.. ఓ వీడియోని వదిలింది సుమ. అయ్యో ఇంతలా బాధపడుతుంది.. ఇంతకు సుమ చేసిన తప్పు ఏంటా అని వీడియో చూసిన జనాలు.. అవాక్కవుతున్నారు. వార్ని ఇలా పిచ్చోళ్లని చేస్తావా అని మండిపడుతున్నారు. ఇంతకు సుమ చేసిన తప్పు ఏంటంటే..

ఉగాది పండగ రోజు డైట్ పక్కన పెట్టేసి.. సుబ్బరంగా తనకు నచ్చినవన్ని లాగించేసిందట సుమ. ఇదే ఆమె చేసిన తప్పు. అందుకు ప్రాయశ్చితంగా వర్క్ అవుట్ చేస్తున్న వీడియోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఉగాది నాడు పులిహోర, పొంగలి, గారెలు, పాయసం గట్టిగా లాగించాను. అవన్నీ కరిగించడానికి ఈ వ్యాయామం అని వీడియోలో చెప్పుకొచ్చింది సుమ. పండగ తర్వాత ప్రాయశ్చితం ఇలా ఉంటుందని క్యాప్షన్ పెట్టింది.

ఇక సుమ వీడియో పై నెటిజెన్స్ భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. మీ క్యాప్షన్ చూసి నిజంగా మీరేదో పెద్ద తప్పు చేశాం అనుకున్నాం కదా.. మరీ ఇంత సిల్లీగా వీడియోలు చేస్తారా.. అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరైతే ఈ వయసులో నీకు అవసరమా? మీరు ముసలి వారని కొందరు ఏకి పారేస్తున్నారు. ఆమె అభిమానులు మాత్రం పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. సుమ చేసిన తప్పు ఇదన్న మాట.

ఇక కెరీర్ విషయానికి వస్తే సుమ ప్రధాన పాత్రలో జయమ్మ పంచాయితీ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అది పరాజయం పాలైంది. కాగా సుమ తన కొడుకు రోషన్ ని హీరోగా పరిచయం చేసింది. బబుల్ గమ్ టైటిల్ తో ఈ చిత్రం విడుదలైంది. అది ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం సుమ తన కొడుకు కెరీర్ మీద దృష్టి పెట్టింది.

Jojobet GirişJokerbetJokerbetJokerbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes Belgique