iDreamPost
android-app
ios-app

రష్మీపై తప్పుడు ప్రచారం.. అలా చేయొద్దంటూ ఆవేదన

  • Published Feb 14, 2024 | 12:57 PM Updated Updated Feb 14, 2024 | 12:57 PM

బుల్లితెర పై పలు టీవీ ప్రోగ్రామ్స్ లో అలరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్న వ్యక్తి యాంకర్ రష్మీ. అయితే , ఈ అమ్మడు తన పైన వస్తున్న రూమర్స్ పై తాజాగా స్పందించింది . ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

బుల్లితెర పై పలు టీవీ ప్రోగ్రామ్స్ లో అలరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్న వ్యక్తి యాంకర్ రష్మీ. అయితే , ఈ అమ్మడు తన పైన వస్తున్న రూమర్స్ పై తాజాగా స్పందించింది . ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Feb 14, 2024 | 12:57 PMUpdated Feb 14, 2024 | 12:57 PM
రష్మీపై తప్పుడు ప్రచారం.. అలా చేయొద్దంటూ ఆవేదన

ఎంటర్టైన్మెంట్ విభాగంలో బుల్లి తెరలో అనేక రకాల షోలు, ప్రోగ్రాంలు నిత్యం వస్తూనే ఉంటాయి. అలా బుల్లితెర ప్రేక్షకులను అలరించే వారిలో యాంకర్ రష్మీ ఒకరు. ఈమె గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నిత్యం ఎదో ఒక షో లో ఈ అమ్మడు అలరిస్తూనే ఉంటుంది. అలాగే ఇటు సోషల్ మీడియాలోను యాక్టీవ్ గా ఉంటూ .. నిత్యం ఫోటోలు షేర్ చేస్తూ.. అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక కొన్నాళ్ల పాటు అటు బుల్లి తెర ప్రేక్షకులను అలరించిన రష్మీ.. ఇటీవల కొన్ని సినిమా ఆఫర్లు రావడంతో.. వెండితెరపై కూడా మెరిసింది. కానీ, వెండితెరపై ఈమె చిత్రాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఈ క్రమంలో రష్మీ .. తన సినీ కెరీర్ పై కొన్ని ర్యూమర్స్ వచ్చాయంటూ.. అటువంటి వాటిని నమ్మకండి అంటూ.. సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది.

బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ.. ప్రేక్షకులందరికీ రష్మీ ఎంత దగ్గరయిందో అందరికి తెలుసు. ఈ క్రమంలోనే ఆమె కొన్ని సినిమాలలో నటించింది రష్మీ .. ఆ చిత్రాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోవడంతో .. రష్మీకి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో ఆమె ఒకానొక ప్రత్యేకమైన ఆఫర్ ను వదులుకుంది అంటూ.. సోషల్ మీడియాలో రష్మిపై కొన్ని ర్యూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ చిత్రంలో గెస్ట్ అప్పీరెన్స్ రోల్ ను రిజెక్ట్ చేసిందట రష్మీ.సంక్రాంతి కానుకగా మహేష్ తన అభిమానులకు .. మాస్ జాతర అందించాడని చెప్పి తీరాలి. ప్రత్యేకించి ఈ సినిమాలో ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్ కు వచ్చిన రెస్పాన్స్ అంత ఇంత కాదు. అయితే ఈ సాంగ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది మాత్రం నటి పూర్ణ. అదే ప్లేస్ లో మొదట రష్మీని సెలెక్ట్ చేసారని .. ఆ ఆఫర్ ను రష్మీ యాక్సెప్ట్ చేయకపోవడంతో .. పూర్ణ నటించిందంటూ కొన్ని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ విషయాలపై రష్మీ స్పదించింది.

సోషల్ మీడియా వేదికగా రష్మీ ఈ విధంగా తన ఆవేదన వ్యక్తం చేశారు. “కుర్చీ మడతపెట్టి సాంగ్ చేయాలనీ నన్నెవరూ సంప్రదించలేదు. నేను రిజెక్ట్ చేశానన్న వార్తల్లో నిజం లేదు. ఇలాంటి ఫేక్ న్యూస్ ను ఎంకరేజ్ చేయకండి. నాపై నెగెటివిటీ పెరిగే అవకాశం ఉంది. ఆ సాంగ్ పూర్ణ అద్భుతంగా చేశారు. ఆమెలా మరొకరు చేయలేరు”. అంటూ రష్మీ చెప్పుకొచ్చారు. ఏదేమైనా సోషల్ మీడియాలో ఇటువంటి పుకార్లు పుట్టుకురావడం అనేది .. ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా మారింది. కాబట్టి, అభిమానులు ఏది నిజం ఏది ర్యూమర్ అనేది తెలుసుకుంటే మంచిది. ఇక ప్రస్తుతం రష్మీ అటు వెండి తెర అవకాశాలు కోసం ఎదురుచూస్తూనే .. పలు టీవీ ప్రోగ్రామ్స్ లో యాకరింగ్ చేస్తూ ఉంది. మరి, తనపై వస్తున్న రూమర్స్ విషయంలో రష్మీ స్పదించిన తీరుపై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş