Keerthi
Anchor Jhansi: టాలీవుడ్ యాంకర్ ఝాన్సీ గురించి అందరికి తెలిసిందే. నిత్యం సోషల్ మీడియాలో పలు విషయాలను ఫ్యాన్స్ కి షేర్ చేస్తూ పోస్టులు చేసిన ఈమె తాజాగా ఓ ఆసక్తికరమైన పోస్టును పెట్టింది. ఇది చూసిన నెటిజన్స్ షాక్ గురైయ్యారు.
Anchor Jhansi: టాలీవుడ్ యాంకర్ ఝాన్సీ గురించి అందరికి తెలిసిందే. నిత్యం సోషల్ మీడియాలో పలు విషయాలను ఫ్యాన్స్ కి షేర్ చేస్తూ పోస్టులు చేసిన ఈమె తాజాగా ఓ ఆసక్తికరమైన పోస్టును పెట్టింది. ఇది చూసిన నెటిజన్స్ షాక్ గురైయ్యారు.
Keerthi
యాంకర్ ‘ఝాన్సీ’. ఈ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అక్కరలేనిది. స్టార్ యాంకర్ సుమ తర్వాత అంతటి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఝాన్సీ కూడా ఒకరు. అలాగే ఈమె ఒక పక్క యాంకర్ గా కొనసాగుతునే అనేక సినిమాల్లో నటిగా వెండితెర పై మెరిశారు. కాగా, గతేడాది వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’,’దసరా’, ‘సలార్’ వంటి సినిమాల్లో కూడా ఝాన్సీ నటించి మెప్పించారు. ఇక సినిమాల్లోనే కాకుండా ఓ వైపు బుల్లితెర పై కూడా అలరిస్తు తెలుగు ప్రేక్షకులకు దగ్గరగా ఉండేవారు ఝాన్సీ. అయితే ప్రస్తుతం ఝాన్సీకి ఏమైందో తెలియదు కానీ పూర్తిగా టెలివిజన్ లో కనిపించడమే మానేశారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈమె ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు. నిత్యం ఏదో ఒక పోస్ట్ లతో ట్రెండ్ కు తగ్గట్లు గా నిలుస్తుంటారు. అయితే తాజాగా ఝాన్సీ తన సోషల్ మీడియా ఖాతాలో రోడ్డు పై చెత్త సేకరిస్తూన్న పోస్ట్ ను షేరు చేశారు. దీంతో మొదట అందరూ ఝాన్సీ అలా చెత్త సేకరించడం చూసి ఆశ్చర్యపోయినా.. ఆ తర్వాత ఆమె అలా ఎందుకు చేస్తుందో తెలుసుకొని షాక్ అయ్యారు.
నిత్యం సోషల్ మీడియాలో తన మూవీ షూటింగ్ విషయాలతో పాటు లైఫ్ స్టైల్ విషయాలు గురించి నెటిజెన్స్ కి టిప్స్ ఇచ్చేలా పోస్టులు చేస్తూ ఆడియన్స్ కి దగ్గరగా ఉంటున్నారు ఝాన్సీ. అయితే, ఈక్రమంలోనే తాజాగా ఆమె ఓ కొత్త వీడియోని పోస్టు చేశారు. ఆ పోస్టులో ఝాన్సీ రోడ్డు పై చెత్త సేకరిస్తూ కనిపించారు.ఇక రోడ్డు పక్కన పడేసిన చెత్తని ఎంతో జాగ్రత్తగా సేకరించి తన కారులో తీసుకోని వెళ్లారు.అసలు ఆ చెత్తను సేకరించడానికి కారణమేమిటంటే.. ప్రకృతి నుంచి వచ్చిన ఎండిపోయిన అరటి ఆకులు, అలాగే ఎండుగడ్డి.. ఈ రెండు వ్యర్థపదార్దలు కావు.అలాగే ప్రకృతి నుంచి వచ్చిన ఏ పదార్ధం అయినా.. అది నాశనం అయ్యేటప్పుడు మళ్ళీ అదే ప్రకృతికి సహాయ పడుతుంది. అదే ప్రకృతిలో ఉన్న గొప్ప లక్షణం. అయితే ఈ విషయం అందరికి తెలిసిందే. ప్రతిఒక్కరు చిన్నప్పుడు దీని గురించి చదువుకునే ఉంటారు.
కాగా, ఇప్పుడు అదే విషయాన్ని ఝాన్సీ మరోసారి తెలియజేస్తూ ఓ పోస్టు పెట్టి వివరించారు. అందులో.. ‘ఎండి గడ్డిని, ఆకులను కాల్చి బూడిద చేయకండి. అవి మన మట్టికి చాలా ఉపయోగపడతాయి. పైగా అవి ప్రకృతి సమతౌల్య సూత్రం’ అంటూ పేర్కొన్నారు. ఈ వీడియో మాత్రమే కాదు గతంలో ఆవు పేడని కూడా ప్రకృతి పద్దతిగా ఎలా ఉపయోగించాలి అనేది కూడా తెలియజేస్తూ వీడియోలు పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు.. ఝాన్సీ చెప్పే ఈ విషయాలు పై నెటిజెన్స్ రియాక్ట్ అవుతున్నారు. అలాగే రకరకాల కామెంట్స్ పెడుతూ ఆమెను అభినందిస్తున్నారు. మరి, యాంకర్ ఝాన్సీ రోడ్ల పై చెత్తను సేకరించి అది ప్రకృతికి ఎలా ఉపాయోగపడుతుందో తెలియజేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.