iDreamPost
android-app
ios-app

ప్రేమ, పెళ్ళిలో ఓడిపోయా! చనిపోవాలనుకున్నా: స్టార్ యాంకర్!

  • Published Jul 30, 2024 | 1:00 AM Updated Updated Jul 30, 2024 | 1:00 AM

ఆమే ఓ స్టార్ యాంకర్, తన కామెడీ టైమింగ్ తో నవ్వులు పువ్వులు పూయిస్తుంది. బిగ్ బాస్ లో కూడా ఆకట్టుకుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఆమే ఓ స్టార్ యాంకర్, తన కామెడీ టైమింగ్ తో నవ్వులు పువ్వులు పూయిస్తుంది. బిగ్ బాస్ లో కూడా ఆకట్టుకుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

  • Published Jul 30, 2024 | 1:00 AMUpdated Jul 30, 2024 | 1:00 AM
ప్రేమ, పెళ్ళిలో ఓడిపోయా! చనిపోవాలనుకున్నా: స్టార్ యాంకర్!

బుల్లితెరపై రాణిస్తూ తమ యాంకరింగ్‌తో ఆకట్టుకునే వ్యాఖ్యాతల వెనుక అంతులేని అగాధం దాగి ఉంది. ఎంతో బాధ ఉన్నా అవన్నీ దిగమింగుకుని తమ మాటలతో, చేష్టలతో కితకితలు పెట్టిస్తున్నారు యాంకరమ్మలు. వారిలో ఒకరు ఆర్య బాబు.. అలియాస్ ఆర్య బడాయి. మలయాళంలో ఫేమస్ యాంకర్ కమ్ కమెడియన్. సీరియల్స్, సినిమాల్లో యాక్ట్ చేసింది ఈ వ్యాఖ్యత. అందరినీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే ఆమె వెనుక అంతులేని విషాదం ఉంది. మలయాళ బిగ్ బాస్‌లోనూ ఆకట్టుకుంది. ఐటీ ఉద్యోగిని పెళ్లి చేసుకోగా.. ఆ కాపురం పదేళ్లకు కూలిపోయింది. ఇప్పుడు కూతురితో కలిసి ఒంటరిగా జీవిస్తుంది. తాజాగా ఆమో ఓ ఇంటర్వ్యూలో పాల్లొగి తన బాధను వెళ్ల గక్కింది ఆర్య.

బడాయి బంగ్లా అనే కామెడీ షోతో తన పేరు కాస్త ఆర్య బడాయిగా మారిపోయింది. సినిమాలు, సీరియల్స్, షోలకు హోస్టుగా వ్యవహరించింది. 2008లో ఐటి ఇంజనీరో రోహిత్ సుశీలన్(నటి అర్చన సుశీలన్ సోదరుడు)ను పెళ్లి చేసుకోగా.. వీరికి రోయా పుట్టింది. 2018లో మనస్పర్థల కారణంగా ఈ జంట విడిపోయారు. బిడ్డను పోషించడానికి ఇటు బుల్లితెరపై హోస్టింగ్ చేస్తూనే కూతురు రోయా పేరుతో బొటిక్ నడుపుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ‘బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. మానసిక ఒత్తిడి తట్టుకోలేక నిద్రమాత్రలు తీసుకోవాలని అనుకున్నారు. నా కూతురిని చూసి ఆగి పోయాను. తనే బాధలో నుండి బయట పడేసింది. ఇప్పుడు తట్టుకోలేనంత బాధ కలిగితే ఎలా గెటిన్ అవ్వాలని ఆలోచస్తున్నా’అని పేర్కొంది.

‘లాక్ డౌన్‌లో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైనప్పుడు కూడా చనిపోవాలనుకున్నా. ప్రేమలో ఫెయిల్ అయ్యా. నేను లేనప్పుడు నా కూతురు పరిస్థితి ఏంటీ అని ఆలోచించా. నాకు నాన్న కూడా లేడు. లేకుంటే ఆయనకు అప్పగించి.. హాయిగా ప్రాణాలు వదిలేదాన్ని. పాప నాన్న కూడా బాగానే చూసుకుంటాడు. కానీ సమాజం ప్రేమలో ఓడిపోయి మీ అమ్మ చనిపోయిందని కాకుల్లా పొడిచి మరీ చస్తారు. అవన్నీ ఆలోచించి ఆగిపోయాను. నా కుటుంబంతో, ఫ్రెండ్స్ తో మాట్లాడాను. మళ్లీ సరైన దారిలోకి వచ్చాను. పెళ్లి, ప్రేమ రెండు వైఫల్యాలే.. అయినా తట్టుకున్నా. చివరకు తండ్రి మరణాన్ని కూడా జీర్ణించుకున్నా. అందుకే నన్ను అందరూ బోల్డ్ అని పిలుస్తుంటారు. కానీ నేను చాలా ఎమోషనల్’ అని చెప్పింది ఆర్య.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet giriş