iDreamPost
android-app
ios-app

దున్నేస్తున్న అనన్య.. వరుస ప్రాజెక్టులు.. ప్రామిసింగ్ పర్మార్మెన్స్ తో

  • Published Mar 01, 2024 | 5:24 PM Updated Updated Mar 01, 2024 | 5:24 PM

Heroine Ananya Nagalla: తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ప్రస్తుతం టాలీవుడ్ ని దున్నేస్తోంది. వరుస ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో దూసుకుపోతోంది.

Heroine Ananya Nagalla: తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ప్రస్తుతం టాలీవుడ్ ని దున్నేస్తోంది. వరుస ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో దూసుకుపోతోంది.

  • Published Mar 01, 2024 | 5:24 PMUpdated Mar 01, 2024 | 5:24 PM
దున్నేస్తున్న అనన్య.. వరుస ప్రాజెక్టులు.. ప్రామిసింగ్ పర్మార్మెన్స్ తో

అనన్య నాగళ్ల.. ఈ అమ్మడు గురించి నిన్న మొన్నటి వరకు చాలా తక్కువ మాట్లాడుకున్నారు. ప్రేక్షకులకు కూడా చాలా తక్కువ మందికే తెలుసు. ఈమె ప్రస్తావన వస్తే వకీల్ సాబ్ ఆర్టిస్టు కదా అనేవాళ్లు. కానీ, రోజులు చాలా వేగంగా మారిపోయాయి. ఇప్పుడు ఈ అమ్మడు టాలీవుడ్ లో ప్రామిసింగ్ హీరోయిన్ గా మారిపోయింది. సైలెంట్ గా వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ తెలుగు హీరోయిన్ తాజాగా తంత్ర సినిమాతో కెరీర్ లో మరో మెట్టు ఎక్కింది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు అంతా ఈ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు.

అనన్య నాగళ్ల అంటే ఇప్పుడు టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పటికే చేతిలో 3 ప్రాజెక్టులు ఉన్నాయి. డిస్కషన్స్ లో కూడా చాలానే సినిమాలు ఉన్నట్లు చెబుతున్నారు. కేవలం రెండేళ్ల వ్యవధిలోనే మొత్తం మారిపోయింది. మాములుగా తెలుగు హీరోయిన్లకు టాలీవుడ్ లో అంత ప్రియారిటీ ఉండదు, పెద్దగా అవకాశాలు ఇవ్వరు అంటూ ఉంటారు. కానీ, అనన్యను చూస్తుంటే.. టాలెంట్ ఉంటే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అంటున్నారు. వచ్చిన ఓ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా అనన్య ఇప్పుడు బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

అందం, అభినయం, అమాయకత్వంతో ఇన్నాళ్లు అలరించింది. ఇప్పుడు తంత్ర సినిమాతో ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించేందుకు రెడీ అయిపోయింది. తాజాగా తంత్ర సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ ట్రైలర్ ట్రెండింగ్ లో ఉంది. అంతేకాకుండా అనన్య పేరు కూడా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఈ తంత్ర ట్రైలర్ విషయానికి వస్తే.. తెలుగు సినిమా హిస్టరీలోనే ఇలాంటి ఒక కల్ట్ హారర్ మూవీ చూసి ఉండరు అని మేకర్స్ చెప్తున్నారు. వాళ్లు చెప్పినట్లుగానే ట్రైలర్ చూసిన తర్వాత మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. బ్లాక్ మ్యాజిక్, వశీ*కరణం, చే*తబడి అంటూ చాలానే తంత్రాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు.

తంత్ర మూవీ ట్రైలర్ చూసిన తర్వాత ముఖ్యంగా అనన్య యాక్టింగ్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్ ని దున్నేస్తోంది. అటు సోషల్ మీడియాలో కూడా ఈ భామకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్ స్టాలో అనన్యకు 14 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇంక ప్రాజెక్టుల విషయానికి వస్తే.. తంత్ర సినిమా మార్చి 15న విడుదల కాబోతోంది. అలాగే వెన్నెల కిషోర్ తో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే మూవీ కూడా చేస్తేంది. పొట్టేల్ అనే సినిమా కూడా ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. కథాకేళీ అనే మూవీ ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇలా ఈ తెలుగమ్మాయి.. టాలీవుడ్ లో వరుస ప్రాజెక్టులతో దూసుకుపోవడం మాత్రమే కాకుండా.. ప్రయత్నం, హార్డ్ వర్క్, కృషి ఉంటే అవకాశాలు- సక్సెస్ తప్పకుండా వస్తుంది అంటూ నిరూపిస్తోంది. మరి.. వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్న అనన్య నాగళ్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio