iDreamPost
android-app
ios-app

Raj Tarun: రాజ్‌తరుణ్‌ ప్రియురాలిపై మరో కేసు.. హీరోయిన్‌ ఫిర్యాదు మేరకు

  • Published Jul 10, 2024 | 10:24 AM Updated Updated Jul 10, 2024 | 10:24 AM

Lavanya: హీరో రాజ్‌ తరుణ్‌ వివాదంలో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. అతడి మాజీ ప్రియురాలి లావణ్య మీద మరో కేసు నమోదయ్యింది. ఆ వివరాలు..

Lavanya: హీరో రాజ్‌ తరుణ్‌ వివాదంలో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. అతడి మాజీ ప్రియురాలి లావణ్య మీద మరో కేసు నమోదయ్యింది. ఆ వివరాలు..

  • Published Jul 10, 2024 | 10:24 AMUpdated Jul 10, 2024 | 10:24 AM
Raj Tarun: రాజ్‌తరుణ్‌ ప్రియురాలిపై మరో కేసు.. హీరోయిన్‌ ఫిర్యాదు మేరకు

టాలీవుడ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ మీద అతడి మాజీ ప్రియురాలు లావణ్య.. అనేక సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. గత పదకొండేళ్లుగా తాము రిలేషన్‌లో ఉన్నామని.. గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని.. అయితే కొంత కాలం క్రితం నుంచి రాజ్‌ తరుణ్‌.. హీరోయిన్‌ మాన్వి మల్హోత్రాతో రిలేషన్‌ ఉన్నాడని.. అందుకే డ్రగ్స్‌ కేసులో ఇరికించి తనను దూరం పెట్టాడని ఆరోపిస్తుంది. అయితే లావణ్య.. ఆరోపణలపై రాజ్‌ తరుణ్‌ స్పందిస్తూ.. లావణ్యతో కొన్నాళ్లు రిలేషన్‌లో ఉన్నమాట నిజమే అని.. అయితే ఆమెకు డ్రగ్స్‌ అలవాటు ఉందని.. వేరే వ్యక్తితో రిలేషన్‌ ఉందని తెలియడంతోనే తాను దూరం పెట్టానని రాజ్‌ తరుణ్‌ చెప్పుకొచ్చాడు. ఈ వివాదంలోకి హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా కూడా చేరింది. లావణ్య తనను బెదిరిస్తుందని ఆరోపించింది. ఈ క్రమంలో తాజాగా ఈ వివాదంలో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. లావణ్యపై మరో కేసు నమోదు చేశారు. ఆ వివరాలు..

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్-అతడి మాజీ ప్రియురాలు లావణ్య మధ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇదివరకే ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంలో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఈ కేసులో కీలకంగా నిలిచిన హీరోయిన్‌ మాల్వి మల్హోత్రా.. రాజ్‌ తరుణ్‌ మాజీ ప్రియురాలు లావణ్యపై మరో ఫిర్యాదు చేసింది. తనని, తన తమ్ముడిని లావణ్య బెదిరిస్తోందని ఆరోపిస్తూ.. మాల్వి మల్హోత్రా.. హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈక్రమంలో పోలీసులు ఈ కేసుని ఫిలిం నగర్ స్టేషన్‌కి బదిలీ చేశారు. లావణ‍్య బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని మాల్వీ తన ఫిర్యాదులో పేర్కొంది.

కొన్ని రోజుల క్రితం లావణ్య అనే యువతి.. మీడియా ముందుకు వచ్చి.. హీరో రాజ్‌ తరుణ్‌ మీద సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఏళ్లుగా తనతో రిలేషన్‌లో ఉన్న రాజ్‌ తరుణ్‌.. హీరోయిన్‌ మాల్వి మల్హోత్రా మాయలో పడి తనని దూరం పెట్టాడని ఆరోపించింది. మాల్వి, ఆమె తమ్ముడు కలిసి తనని బెదిరిస్తున్నారని, రాజ్ తరుణ్‌ని వదిలేయకపోతే చంపేస్తామని బెదిరిస్తున్నారని చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది.

తనపై లావణ్య అసత్య ఆరోపణలు చేస్తోందని చెప్పుకొచ్చిన నటి మాల్వి మల్హోత్రా.. ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక తాజాగా మరోసారి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. లావణ్య.. తనని, తన తమ్ముడిని బెదిరింపులకు గురి చేస్తుందని ఫిర్యాదులో పేర్కొంది. లావణ్య బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ వివాదంలో ఇంకేం ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాలి అంటున్నారు.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişjojobet girişcasibomcasibomgrandpashabet