iDreamPost
android-app
ios-app

Ameesha Patel: నా జీవితాన్ని ఆ దర్శకుడు నాశనం చేశాడు.. అమీషా పటేల్ సంచలన కామెంట్స్!

  • Author singhj Published - 05:16 PM, Tue - 4 July 23
  • Author singhj Published - 05:16 PM, Tue - 4 July 23
Ameesha Patel: నా జీవితాన్ని ఆ దర్శకుడు నాశనం చేశాడు.. అమీషా పటేల్ సంచలన కామెంట్స్!

సినీ ఇండస్ట్రీలోకి ఎందరో యాక్టర్స్ వస్తుంటారు, పోతుంటారు. అయితే కొందరు తారలు మాత్రం ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటారు. అలాంటి వారిలో ఒకరు అమీషా పటేల్. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మకు ఆడియెన్స్​లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఇరవై ఏళ్ల కింద హిందీ చిత్ర పరిశ్రమలో ఆమె హీరోయిన్​గా చక్రం తిప్పారు. ఆల్​టైమ్ బాలీవుడ్ హిట్స్​లో ఒకటిగా నిలిచిన ‘గదర్’లో హీరోయిన్​గా నటించి కోట్లాది మంచి హృదయాలను గెలుచుకున్నారామె. తెలుగు వారికీ ఆమె సుపరిచితురాలే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్​ సరసన ‘బద్రి’లో యాక్ట్ చేసి టాలీవుడ్ ఆడియెన్స్​ను మెప్పించారు అమీషా.

‘బద్రి’ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన ‘నాని’, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన ‘నరసింహుడు’తో పాటు నటసింహం బాలకృష్ణతో ‘పరమవీరచక్ర’లో యాక్ట్ చేశారు అమీషా పటేల్. అయితే ఈ మూడు సినిమాలు అంతగా ఆడలేదు. గ్లామర్​తో పాటు దీటైన యాక్టింగ్​తో మెప్పించడంలో అమీషా పటేల్ ఆరితేరారు. అందుకే ఆమెను తమ సినిమాల్లోకి తీసుకునేందుకు దర్శక నిర్మాతలు క్యూ కట్టేవారు. నటనకు స్కోప్ ఉన్న పాత్రల్లోనే గాక పలు గ్లామర్ రోల్స్​తోనూ ఇండస్ట్రీని ఆమె షేక్ చేశారు. ఇప్పటికీ అడపాదడపా సినిమాల్లో మెరుస్తున్నారీ ముదురు భామ.

ఐదు పదుల వయసులోనూ ఇంకా పెళ్లి చేసుకోలేదు అమీషా పటేల్. అలాంటి ఆమె తాజాగా తన పర్సనల్ లైఫ్​తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఒక బాలీవుడ్ డైరెక్టర్ వల్లే తన కెరీర్ నాశనమైందని ఆమె అన్నారు. దర్శక నిర్మాత విక్రమ్ భట్​తో తన రిలేషన్​షిప్ గురించి బహిరంగంగా మాట్లాడటం వల్లే కెరీర్ దెబ్బతిన్నదని అమీషా తెలిపారు. దీంతో ఒక దశాబ్దానికి పైగా పురుషులకు దూరంగా ఉంటూ వస్తున్నానని పేర్కొన్నారు. ఫిలిం ఇండస్ట్రీలో నిజాయితీకి విలువ లేదన్నారు. తాను మాత్రం ఎంతో నిజాయితీగా ఉన్నానని ఆమె వివరించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి