Dharani
Dharani
మెగా ఫ్యామిలీతో పాటు.. అభిమానులకు కూడా ఈ ఏడాది చాలా ముఖ్యమైనది. 2023లో మెగా కుటుంబంలో ఎన్నో మంచి విషయాలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది రామ్ చరణ్ నటించిన ట్రిపుల్ ఆర్ చిత్రం ఆస్కార్ గెలిచింది. ఇక ఈ ఏడాది చింరజీవి వాల్తేరు వీరయ్యతో సాలిడ్ హిట్ కొట్టాడు. వీటన్నింటికి మంచి మెగా కుటుంబ సభ్యులు మాత్రమే కాక.. అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఆత్రుతగా ఎదురు చూస్తోన్న మెగా వారసురాలు కూడా ఈ ఏడాదే జన్మించింది. రామ్ చరణ్-ఉపాసన దంపతులు ఈ ఏడాది తల్లిదండ్రులు అయ్యారు. ఈ నెలలో వారికి ఆడపిల్ల జన్మించింది. వారసురాలి రాకతో మెగా కుటుంబంలో అంబరాలు సంబరాన్ని అంటాయి. తల్లిదండ్రులైన రామ్ చరణ్ దంపతులకు సినీ, రాజకీయ, బిజినెస్ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక చిన్నారి మెగా ప్రిన్సెస్‌కి వెల్కం చెబుతూ.. బహుమతులు పంపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ దంపతులు.. రామ్ చరణ్-ఉపాసనల బిడ్డకు అరుదైన కానుక ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. ఆ వివరాలు..
ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోన్న సమాచారం మేరకు శుక్రవారం మెగా ప్రిన్సెస్‌కు బారసాల కార్యక్రమం నిర్వహించబోతున్నారట. ఎన్నో ఏళ్ల ఎదురు చూపుల తర్వాత.. తమ కుటుంబంలోకి వచ్చిన చిట్టితల్లి బారసాల కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించనున్నారని సమాచారం. ఇప్పటికే రామ్ చరణ్ దంపతులకు బిజినెస్ దిగ్గజం ముఖేష్ అంబానీ దంపతులు.. అదిరిపోయే గిఫ్ట్ పంపించి ఆశ్చర్యపరిచారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇంతకు ముఖేష్ అంబానీ దంపతులు ఏం బహుమతి ఇచ్చారంటే.. బంగారు ఊయల. అవును పాప కోసం బంగారు ఊయలను బహుమతిగా పంపారట అంబానీ దంపతులు. ఈ ఊయలలోనే చిన్నారి మెగా ప్రిన్సెస్‌కు బారసాల వేడుకను నిర్వహిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
రామ్ చరణ్, ఉపాసనలకు పెళ్లి జరిగిన 11 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులు అయ్యారు. ఈ ఏడాది వారికి ఆడపిల్ల జన్మించింది. ఈ మధుర క్షణాల కోసం తామందరం ఎంతగానో ఎదురు చూశామని మెగా కుటుంబం సంతోషాన్ని వ్యక్తం చేసింది. పుట్టిన గంటల్లోనే పాప జాతకం అద్భుతం అంటూ వార్తలు కూడా బయటకు వచ్చేశాయంటే ఈ న్యూస్ కోసం ఎంత జనాలు, మెగా ఫ్యాన్స్ ఎంత ఆత్రుతగా ఎదురు చూశారో అర్థం అవుతోంది. పాప పుట్టిన తర్వాత తాము అత్త మామలు చిరంజీవి – సురేఖలతోనే కలిసి ఉండబోతున్నామని చెప్పేసింది ఉపాసన.