nagidream
ఐకాన్ స్టార్ ఏమిటి?.. ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయడం ఏంటి నాన్సెన్స్ అనుకుంటున్నారా? కానీ అల్లు అర్జున్ అసిస్టెంట్ డైరెక్టర్ అయిన మాట నిజమే.
ఐకాన్ స్టార్ ఏమిటి?.. ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయడం ఏంటి నాన్సెన్స్ అనుకుంటున్నారా? కానీ అల్లు అర్జున్ అసిస్టెంట్ డైరెక్టర్ అయిన మాట నిజమే.
nagidream
అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా దూసుకుపోతున్నారు. పుష్ప సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన ఐకాన్ స్టార్.. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. సినిమా సినిమాకి స్టైల్ ఛేంజ్ చేస్తూ.. తనను తాను మార్చుకుంటూ ఇవాళ జాతీయ నటుడి స్థాయికి ఎదిగారు. తెలుగు హీరోలెవరికీ జాతీయ నటుడు అవార్డు రాలేదు. అలాంటిది జాతీయ అవార్డు అందుకున్న తెలుగు తొలి హీరోగా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించారు. దీనికి ఆయన పడ్డ కష్టం.. ఆయన చూపించిన డెడికేషనే కారణం. తన కెరీర్ లో అన్ని సినిమాల కోసం పడ్డ కష్టం ఒక ఎత్తు అయితే.. పుష్ప సినిమా కోసం పడ్డ కష్టం మరొక ఎత్తు.
అయితే ఇంత ఘనత సాధించిన అల్లు అర్జున్ ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టరా? ఒక పక్క స్టార్ హీరోగా దూసుకుపోతుంటే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ ఏంటి? అని అనుకుంటున్నారా? కానీ ఇది నిజం. అల్లు అర్జున్ ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. శ్రీకాంత్, వేణు కలిసి నటించిన పెళ్ళాం ఊరెళితే సినిమాకి అల్లు అర్జున్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. కొన్ని రోజుల పాటు ఎస్వీ కృష్ణారెడ్డి దగ్గర పని చేశారు. ఈ విషయాన్ని ఎస్వీ కృష్ణారెడ్డి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పెళ్ళాం ఊరెళితే సినిమాకి అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా 2003లో విడుదలైంది. శ్రీకాంత్, సంగీత, వేణు, రక్షిత, సునీల్ నటించిన ఈ మూవీ అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమాకి అల్లు అర్జున్ ని డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి దగ్గర అసిస్టెంట్ గా పని చేయమని చెప్పారట.
దీంతో అల్లు అర్జున్ ఆ మూవీకి కొన్ని రోజులు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. అయితే పని చేసిన సమయంలో అల్లు అర్జున్ ఎస్వీ కృష్ణారెడ్డికి భయపడేవారట. ఇండస్ట్రీలో నేను ఎవరికీ భయపడలేదు కానీ మీరంటే మాత్రం భయపడేవాడ్ని అంటూ తనతో అల్లు అర్జున్ అనేవారని గుర్తు చేసుకున్నారు. అల్లు అర్జున్ 1985లో వచ్చిన విజేత సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఆ తర్వాత స్వాతిముత్యం సినిమాలో నటించారు. డాడీ సినిమాలో అతిథి పాత్రలో మెరిసిన అల్లు అర్జున్.. గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. నటుడిగా మొదటి సినిమా విజేత అయితే.. అసిస్టెంట్ డైరెక్టర్ గా అల్లు అర్జున్ తొలి సినిమా పెళ్ళాం ఊరెళితే. మరి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అనుభవంతో ఫ్యూచర్ లో దర్శకత్వం చేస్తే బాగుణ్ణు. అసిస్టెంట్ డైరెక్టర్ గా అల్లు అర్జున్ పని చేయడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.