iDreamPost
android-app
ios-app

మెగా వారసురాలికి అల్లు అర్జున్ విలువైన కానుక!

  • Published Aug 02, 2023 | 6:15 PM Updated Updated Aug 02, 2023 | 6:15 PM
  • Published Aug 02, 2023 | 6:15 PMUpdated Aug 02, 2023 | 6:15 PM
మెగా వారసురాలికి అల్లు అర్జున్ విలువైన కానుక!

మెగా ప్రినెస్స్ రాకతో మెగా ఫ్యామిలీలో ఆనందాలు రెట్టింపు అయ్యాయి. దాదాపు 11 ఏళ్ల తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులకు పండంటి ఆడపిల్ల జన్మించింది. మెగా వారసురాలికి క్లిన్ కారా అని పేరు పెట్టారు. మెగా కాంపౌండ్ లో సంబరాలు అంబరాన్ని అంటాయి. చిన్నారి బారసాల అంగరంగ వైభవంగా జరిగింది. బంధుమిత్రుల సమక్షంలో బారసాలను వేడుకగా జరిపారు. రామ్ చరణ్– ఉపాసనల గారాలపట్టి క్లిన్ కారాకు ఎంతో ఖరీదైన అద్భుతమైన బహుమతులు వచ్చాయి. ఇప్పటికీ ఆమెకు బహుమతులు వస్తూనే ఉన్నాయి.

మెగా ఇంట వారసులురాలు అడుగుపెట్టింది అనగానే చిరంజీవి కుటుంబం ఎంత సంతోషించిందో అలాగే ఇండస్ట్రీ, మెగా అభిమానులు అంతే సంబరాలు చేసుకున్నారు. క్లిన్ కారాకు బహుమతులు పంపుతున్నారు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ పేరిట ఓ వార్త వైరల్ అయిన విషయం తెలిసిందే. క్లిన్ కారా కోసం తారక్ బంగారంతో డాలర్స్ తయారు చేయిస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చారు. ఆ వార్త విని అటు మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు.. తారక్ ఫ్యాన్స్ కూడా సంతోష పడ్డారు. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరిట ఒక వార్త వైరల్ అవుతోంది. క్లిన్ కారా కోసం బన్నీ చాలా స్పెషల్, ఖరీదైన గిఫ్ట్ ఇస్తున్నట్లు చెబుతున్నారు. క్లిన్ కారా కోసం అల్లు అర్జున్ ఒక ప్లేట్ ని తయారు చేయిస్తున్నాడంట. అయితే అది అలాంటి ఇలాంటి ప్లేట్ కాదు.. ఆ ప్లేట్ పై బంగారు అక్షరాలతో క్లిన్ కారా పేరు, ఆమె పుట్టిన వివరాలు అన్నీ దానిపై ఉంటాయని చెబుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ram Charan (@alwaysramcharan)

నిజంగా బన్నీ ఇస్తున్న గిఫ్ట్ గురించి వింటేనే ఎంతో స్పెషల్ గా ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇంక అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే బన్నీ ఇచ్చే గిఫ్ట్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ప్రతి విషయంలో మా హీరో టాప్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మెగా వారసురాలి విషయానికి వస్తే.. ఆమె బారసాలకు సంబంధించి మెగా ఫ్యామిలీ ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియోలో ఉపాసన చేసిన కామెంట్స్ ఎంతో వైరల్ అయ్యాయి. అవేంటంటే.. క్లిన్ కారాను చెంచుల్లో భాగంగా వెల్లడించారు. ఆమె పేరు వెనుక ఎలాంటి ట్యాగ్స్ ఉండవని స్పష్టం చేశారు. బారసాల రోజు చెంచు తెగవాళ్లు వచ్చి వారి సంప్రదాయంలో పూజలు, నృత్యాలు చేశారు. రామ్ చరణ్- ఉపాసన తీసుకున్న ఆ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వచ్చిన విషయం తెలిసిందే. ఎంతో ఉన్నతంగా ఆలోచించారు అంటూ వారిని పొగడ్తలతో ముంచెత్తారు.

 

View this post on Instagram

 

A post shared by Ram Charan (@alwaysramcharan)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom