iDreamPost
android-app
ios-app

Pushpa 2 Teaser: పుష్ఫ 2 టీజర్ రిలీజ్.. బన్నీ దెబ్బకి థియేటర్లు తగలబడిపోవాల్సిందే!

  • Published Apr 08, 2024 | 11:25 AM Updated Updated Apr 08, 2024 | 11:39 AM

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ఫ 2 టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. సుకుమార్ మరోసారి తన మార్క్ టేకింగ్ తో అదరగొట్టాడు. మరి ఈ టీజర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం పదండి.

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ఫ 2 టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. సుకుమార్ మరోసారి తన మార్క్ టేకింగ్ తో అదరగొట్టాడు. మరి ఈ టీజర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం పదండి.

  • Published Apr 08, 2024 | 11:25 AMUpdated Apr 08, 2024 | 11:39 AM
Pushpa 2 Teaser: పుష్ఫ 2 టీజర్ రిలీజ్.. బన్నీ దెబ్బకి థియేటర్లు తగలబడిపోవాల్సిందే!

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ఫ 2 టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా నేడు(ఏప్రిల్ 8 ) ఉదయం 11:07 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేశారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. దుమ్మురేపుతోంది టీజర్. సుకుమార్ మరోసారి తన మార్క్ టేకింగ్ తో అదరగొట్టాడు. మరి ఈ టీజర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం పదండి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప పార్ట్ 1 ఎంతటి భారీ విజయాన్ని సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రికార్డు స్థాయిలో కలెక్షన్లను కొల్లగొట్టింది ఈ చిత్రం. ఇక ఈ మూవీకి పార్ట్ 2 వస్తున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 ది రూల్ పేరుతో వస్తున్న సీక్వెల్ కు సంబంధించిన టీజర్ ను అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న విడుదల చేశారు. ఇక విడుదలైన కొద్ది నిమిషాల్లోనే యూట్యూబ్ లో రికార్డులు బద్దలు కొడుతూ.. వ్యూస్ ను సొంతం చేసుకుంటూ దూసుకెళ్తోంది.

ఇక టీజర్ విషయానికి వస్తే.. 1:08 నిమిషాలు ఉన్న ఈ టీజర్ లో కేవలం గంగమ్మ తల్లి జాతరకు సంబంధించిన సీన్స్ మాత్రమే చూపించారు. అమ్మవారి వేశంలో బన్నీ విశ్వరూపం చూపించాడు. రాక్షసులను సంహరించే అవతారంలో బన్నీ సృష్టించిన వీరంగానికి థియేటర్లు తగలబడిపోవాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్. పుష్పా 2కు ఈ గంగమ్మ తల్లి జాతర సీనే హైలెట్ అని టీజర్ చూస్తేనే తెలుస్తోంది. ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో కూడా ఇలాంటి సీన్ లో నటించలేదనే చెప్పాలి. ఇక విడుదలైన కొన్ని నిమిషాల్లోనే యూట్యూబ్ లో రికార్డులు కొల్లగొడుతూ.. దూసుకెళ్తోంది పుష్ఫ 2 టీజర్. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 15న థియేటర్లలోకి రానున్నాడు పుష్ఫ రాజ్. మరి ఈ టీజర్ చూసి ఎలా ఉందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabet