iDreamPost
android-app
ios-app

Pushpa-2 Teaser: పుష్ఫ 2 టీజర్ ఆల్ టైమ్ రికార్డ్! ఇది సర్ బన్నీ రేంజ్..

  • Published Apr 08, 2024 | 3:50 PM Updated Updated Apr 08, 2024 | 3:50 PM

బన్నీ బర్త్ డే కానుకగా విడుదలైన పుష్ఫ 2 టీజర్ యూట్యూబ్ లో సంచలనాలు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ టీజర్ ఆల్ టైమ్ రికార్డును సృష్టించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళితే..

బన్నీ బర్త్ డే కానుకగా విడుదలైన పుష్ఫ 2 టీజర్ యూట్యూబ్ లో సంచలనాలు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ టీజర్ ఆల్ టైమ్ రికార్డును సృష్టించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Apr 08, 2024 | 3:50 PMUpdated Apr 08, 2024 | 3:50 PM
Pushpa-2 Teaser: పుష్ఫ 2 టీజర్ ఆల్ టైమ్ రికార్డ్! ఇది సర్ బన్నీ రేంజ్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా పుష్ఫ 2 టీజర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక టీజర్ లో బన్నీ నట విశ్వరూపం చూపిచాడు. టీజర్ లో కేవలం గంగమ్మ తల్లి జాతర సీన్ మాత్రమే చూపించారు. కాగా.. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే రికార్డులను బద్దలు కొడుతూ యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాడు పుష్ఫరాజ్. తాజాగా పుష్ఫ 2 టీజర్ ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసిందని మేకర్స్ ప్రకటించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇది సర్ బన్నీ రేంజ్ అంటూ సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేస్తున్నారు.

పుష్ఫ 2 టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని వేయి కళ్లతో ఎదురుచూశారు అభిమానులు. ఇక వారి ఎదురుచూపులకు తెరదించుతూ.. బన్నీ పుట్టినరోజు సందర్భంగా 1:08 నిమిషాల నిడివి గల టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. కేవలం గంగమ్మ తల్లి జాతర సీన్ ను మాత్రమే ఇందులో చూపించారు. మిగతా ఏ పాత్రను కూడా చూపించకుండా మేకర్స్ హైప్ ను క్రియేట్ చేశారు. ఇక విడుదలైన కొన్ని నిమిషాల్లోనే టీజర్ ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. పుష్ప 2 టీజర్ కేవలం 101 నిమిషాల్లోనే 500K లైక్స్ ను సొంతం చేసుకుని ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది.

దీంతో బన్నీ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. తమ హీరో ఆల్ టైమ్ రికార్డు కొట్టడంతో.. ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇది సర్ బన్నీ రేంజ్ అంటూ సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని పంచుకుంటున్నారు. కాగా.. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్న నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మరి పుష్ఫ 2 టీజర్ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabet