iDreamPost
android-app
ios-app

అచ్చం సుకుమార్ లా బన్నీ.. షాకిచ్చిన సుక్కు భార్య!

Allu Arjun- Sukumar: పుష్ప 2 సినిమా కోసం పాన్ ఇండియా లెవల్లో ఉన్న సినిమా లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది.

Allu Arjun- Sukumar: పుష్ప 2 సినిమా కోసం పాన్ ఇండియా లెవల్లో ఉన్న సినిమా లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది.

అచ్చం సుకుమార్ లా బన్నీ.. షాకిచ్చిన సుక్కు భార్య!

పుష్ప 2 సినిమాపై పాన్ ఇండియా లెవల్లో అంచనాలు ఉన్నాయి. అందరూ ఎప్పుడెప్పుడు పుష్పగాడి రూల్ మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు. సినిమా షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతోంది. అభిమానులు మాత్రం అప్ డేట్స్ అంటూ సోషల్ మీడియాలో గొడవ చేస్తున్నారు. అయితే అధికారికంగా అప్ డేట్ ఏమీ రాకపోయినా.. డైరెక్టర్ సుకుమార్ భార్య మాత్రం ఒక ఫొటోని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇంకేముంది.. ఆ ఫొటో చుట్టూ గట్టిగానే బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఏదో ఒక అప్ డేట్ అయితే ఇచ్చారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే పుష్ప 2లో బన్నీ లుక్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలుసు.. కానీ, ఆ పిక్ లో మాత్రం లుక్స్ కాస్త డిఫరెంట్ గా ఉన్నాయి.

పుష్ప సినిమాలో బన్నీ లుక్స్ ఎంతో కొత్తగా ఉంటాయి. కూలికి వెళ్లినన్ని రోజులు మాసిపోయిన లుంగీ, పాత టీషర్ట్ వేసుకుని చింపి గడ్డంతో ఉంటాడు. కానీ, ఎప్పుడైతే పుష్ప పార్టనర్ అవుతాడో అప్పుడు కాస్త డిగ్నిటీ వస్తుంది. ఆ తర్వాత మంగళం శ్రీను పొజిషన్ హైజాక్ చేసిన తర్వాత మొత్తం మారిపోతుంది. డ్రెస్సింగ్, లుక్స్, బాడీ లాంగ్వేజ్ అన్నీ కొత్తగా ఉంటాయి. మొదటి పార్ట్ లోనే వేరియేషన్స్ చూసి అందరూ వారెవ్వా అన్నారు. కానీ, రెండో పార్ట్ లో అవి నెక్ట్స్ లెవల్ కి వెళ్తాయని చెబుతున్నారు. యంగ్ లుక్స్ లో ఉండే పోస్టర్ ఇప్పటికే రిలీజ్ చేశారు. అందులో చేతి చిటికిన వేలుకు నెయిల్ పాలిష్ వేసుకుని ఉన్నాడు. వేళ్లకు రకరకాల ఉంగరాలు ఉన్నాయి.

పుష్ప 2 టీజర్ లో పరారీలో ఉన్న బన్నీ లుక్స్ కాస్త ఓల్డేజ్ లో ఉన్నాయి. ఇలాంటి వేరియషన్స్ చూస్తున్న సమయంలో సుకుమార్ భార్య కొత్త షాకిచ్చింది. బన్నీతో ఉన్న పిక్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. దానికి హ్యాష్ ట్యాగ్ పుష్ప ది రూల్ అని పెట్టింది. ఈ లుక్ కూడా పుష్ప-2లో ఉంటుందని తెలుస్తోంది. ఇన్ని వేరియేషన్స్ ఉండబోతున్నాయని తెలిసి అందరూ కథపై మరిన్ని అంచనాలు పెంచేసుకుంటున్నారు. పుష్ప-2 సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మూవీ టీమ్ ఎలాగూ అప్ డేట్స్ ఇవ్వడం లేదు.. మీరైనా ఇవ్వండి మేడమ్ అంటూ సుక్కు భార్యకు బన్నీ ఫ్యాన్స్ రిక్వెస్టులు పెట్టుకుంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar)

బన్నీ లుక్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. అల్లు అర్జున్ అచ్చం చూడటానికి సుకుమార్ లా ఉన్నాడు. గడ్డం, జుట్టు, డ్రెస్సింగ్ మాత్రమే కాకుండా.. ఆఖరికి కళ్లజోడు కూడా సుక్కు స్టైల్ లోనే ఉంది. ఇది చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఎంత డైరెక్టర్ అయితే మాత్రం హీరోని అచ్చం నీకులా మార్చేసుకుంటావా? అంటూ ఫ్నన్నీ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా నెక్ట్స్ లెవల్లో ఉంటుందని అర్థమవోతోంది. చెప్పిన సమయానికి విడుదల చేస్తారు అని కూడా నమ్మకం ఉంది. కానీ, ఒక అప్ డేట్ ఏదైనా ఇవ్వచ్చు కదా అంటూ బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సుకుమార్ కు రిక్వెస్టులు పెడుతున్నారు. ఇంక పుష్ప పార్ట్ 3 మీద కూడా ఇప్పటి నుంచే సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. పార్ట్ 3 కూడా ఉంటుందని గట్టిగా చెబుతున్నారు. అయితే పార్ట్ 2 పూర్తైన వెంటనే పార్ట్ 3ని స్టార్ట్ చేయరట. దానికి కాస్త టైమ్ తీసుకుంటారని తెలుస్తోంది. మరి.. సుక్కులా మారిపోయిన బన్నీ మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar)

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş