iDreamPost
android-app
ios-app

Allu Arjun: అభిమానులకు బన్నీ హామీ.. ఇకపై అలా జరగదంటూ!

  • Published Aug 22, 2024 | 8:02 AM Updated Updated Aug 22, 2024 | 8:27 AM

Allu Arjun-Pushpa 2 Release: అభిమానులే తన బలం అన్న బన్నీ.. వారికి ఒక హామీ ఇచ్చాడు.. ఇకపై అలా జరగదని వారికి ప్రామిస్‌ చేశాడు. ఇంతకు బన్నీ దేని కామెంట్స్‌ చేశాడంటే..

Allu Arjun-Pushpa 2 Release: అభిమానులే తన బలం అన్న బన్నీ.. వారికి ఒక హామీ ఇచ్చాడు.. ఇకపై అలా జరగదని వారికి ప్రామిస్‌ చేశాడు. ఇంతకు బన్నీ దేని కామెంట్స్‌ చేశాడంటే..

  • Published Aug 22, 2024 | 8:02 AMUpdated Aug 22, 2024 | 8:27 AM
Allu Arjun: అభిమానులకు బన్నీ హామీ.. ఇకపై అలా జరగదంటూ!

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ అభిమానులకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఇండస్ట్రీలో అందరికి తెలుసు. ఫ్యాన్సే తన బలం అని.. వారిని ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటాను అంటూ.. సందర్భం వచ్చిన ప్రతి సారి అభిమానుల మీద తనకున్న ప్రేమను చాటుకుంటాడు. అంతేకాక.. అప్పుడప్పుడు వారిని స్వయంగా వెళ్లి పలకరిస్తుంటాడు. ఇక పుష్ప ముందు వరకు బన్నీకి కేవలం సౌత్‌లోనే అభిమానులుండేవారు. కానీ పుష్ప తర్వాత.. ఐకాన్‌ స్టార్‌ రేంజ్‌ ప్యాన్‌ ఇండియా వైడ్‌గా పాకింది. నార్త్‌లో కూడా బన్నీకి బీభత్సమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్‌తో బిజీగా ఉన్న బన్నీ.. తాజాగా అభిమానులకు ఒక హామీ ఇచ్చాడు. ఇకపై అలా జరగదంటూ చెప్పుకొచ్చాడు. ఇంతకు బన్నీ కామెంట్స్‌ దేని గురించి.. అసలు ఆయన ఎక్కడ ఈ వ్యాఖ్యలు చేశాడంటే..

దర్శకుడు సుకుమార్‌ భార్య.. తబిత కుమారి సమర్పణలో రావు రమేష్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా మారుతీ నగర్‌ సుబ్రహ్మణ్యం. తాజాగా బుధవారం నాడు ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బన్నీ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆయనతో పాటు దర్శకుడు సుకుమార్‌ కూడా వచ్చాడు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అభిమానులు తన కోసం మూడేళ్లుగా ఎదురు చూస్తున్నారని.. ఇకపై వారిని ఇలా వెయిట్‌ చేయించనని హామీ ఇచ్చాడు. అలానే పుష్ప రిలీజ్‌ డేట్‌పై కూడా హామీ ఇచ్చాడు బన్నీ.

Bunny guarantee for fans

ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘మై డియర్ ఫాన్స్, నా ఆర్మీ ఐ లవ్ యు. నా ఫాన్స్ అంటే నాకు పిచ్చి హీరోని చూసి చాలామంది ఫాన్స్ అవుతారు కానీ నేను నా అభిమానులను చూసి హీరో అయ్యాను. నా నుంచి కొత్త సినిమా వచ్చి మూడేళ్లు అవుతున్నా.. మీరు చూపించే ప్రేమ ఏమాత్రం తగ్గలేదు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా మరోసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను తప్పకుండా ఎక్కువ సినిమాలు చేస్తూ.. ఎక్కువగా తెరమీద కనిపిస్తానని’’ అభిమానులకు బన్నీ హామీ ఇచ్చాడు.

అంతేకాక తాను చేస్తున్న సినిమాలు గురించి విడుదలకి ముందు మాట్లాడడం తనకు కాస్త టెన్షన్ అనిపిస్తుంది అని చెప్పుకొచ్చాడు. అయితే పుష్ప 2 మాత్రం ఒక రేంజ్ లో సక్సెస్ అవుతుందని ఐకాన్‌ స్టార్‌ ధీమా వ్యక్తం చేశాడు. అంతేకాక పుష్ప స్టైల్ లో థియేటర్లలో అడుగుపెట్టేలా చేస్తానని అభిమానులకు హామీ ఇచ్చాడు. ఇదే వేదిక మీద మాట్లాడుతూ.. పుష్ప రిలీజ్‌ డేట్‌ మీద పక్కా క్లారిటీ ఇచ్చేశాడు అల్లు అర్జున్‌.

వాస్తవానికి పుష్ప సినిమా ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కావాల్సి ఉండగా.. షూటింగ్‌ కంప్లీట్‌ కాకపోవడంతో.. దాన్నిఈ ఏడాది డిసెంబర్‌ 6వ తేదీకి వాయిదా వేశారు. అయితే డిసెంబర్ 6వ తేదీ కూడా సినిమా విడుదల కష్టమే అనే ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అది నిజం కాదని.. డిసెండర్‌ 6న పక్కా థియేటర్‌లో పుష్పరాజ్‌ మాస్‌ ఎంట్రీ ఉంటుందని హామీ ఇచ్చాడు బన్నీ.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabettarafbet girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet