iDreamPost
android-app
ios-app

పొలిటికల్ లీడర్ ఫామ్ హౌస్ లో అల్లు అర్జున్! రాయలసీమ వంటకాలతో..

  • Author Soma Sekhar Published - 05:46 PM, Sat - 8 July 23
  • Author Soma Sekhar Published - 05:46 PM, Sat - 8 July 23
పొలిటికల్ లీడర్ ఫామ్ హౌస్ లో అల్లు అర్జున్! రాయలసీమ వంటకాలతో..

అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప 2 ది రూల్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఓ సినిమాను అనౌన్స్ చేశాడు అల్లు అర్జున్. ఇక బన్నీ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్.. పుష్ప 2పై అంచనాలను భారీగా పెచ్చింది. ఈ సినిమాపై హైప్ ను క్రియేట్ చేయడంలో డైరెక్టర్ సుకుమార్ సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇక ఇదంతా కొద్దిసేపు పక్కన పెడితే.. తాజాగా ఓ రాజకీయ నాయకుడి ఫామ్ హౌజ్ లో మెరిశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆ పొలిటికల్ లీడర్ ఎవరు? బన్నీ ఆయన ఫామ్ హౌస్ కు ఎందుకు వెళ్లారో ఇప్పుడు తెలుసుకుందాం.

అల్లు అర్జున్.. ఐకాన్ స్టార్ గా టాలీవుడ్ లో దూసుకెళ్తున్నారు. పుష్ప సినిమా హిట్ తో తన రేంజ్ ను పాన్ ఇండియా స్థాయికి పెంచుకున్నాడు బన్నీ. ప్రస్తుతం పుష్ఫ 2 సినిమాలో నటిస్తున్నాడు అల్లు అర్జున్. ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇక బన్నీ రాజకీయాలు చాలా దురంగా ఉంటారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఏదో ఒక పార్టీకి కొద్దో గొప్పో సపోర్ట్ ఇస్తూ.. వస్తున్న సంగతి మనకు తెలియనిది కాదు. కానీ బన్నీ అలా కాదు. ఇప్పటి వరకు తన మద్ధతు పలానా పార్టీకి అని ఎప్పుడు చెప్పింది కూడా లేదు. అదీకాక రాజకీయ నాయుకులతో కలిసిందీ లేదు.

కానీ తాజాగా సోషల్ మీడియాలో ఓ పొలిటికల్ లీడర్ ఫామ్ హౌస్ లో కనిపించి ఫ్యాన్స్ ను షాక్ కు గురిచేశారు. అసలు విషయం ఏంటంటే? తాజాగా అల్లు అర్జున్ తన ఫ్రెండ్స్ తో కలిసి హైదరాబాదు నుంచి బెంగుళూరుకు వెళ్తున్నారు. మార్గం మధ్యలో గార్లదిన్నె మండలం కనుంపల్లిలో ఆగారు. ఇది తెలుసుకున్న అనంతపురం జిల్లా TDP నాయకులు అతనికి ఘన స్వాగతం పలికారు. శింగనమల ద్విసభ్య కమిటీ సభ్యులు ముంటిమడుగు కేశవరెడ్డి అల్లు అర్జున్ ను తన ఫామ్ హౌస్ లోకి ఆహ్వానించారు. ఆయన ఆహ్వానాన్ని మన్నించిన బన్నీ.. ఫామ్ హౌస్ కు వెళ్లారు. ఇక అల్లు అర్జున్ రావడంతో.. రాయలసీమ వంటకాలతో పసందైన విందును ఏర్పాటు చేశారు. రాయలసీమ రుచులు ఆరగించిన బన్నీ.. తర్వాత ఫామ్ హౌస్ లో ఫొటోలకు ఫొజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet