అల్లు అరవింద్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ఏ సినిమా అయిన నిర్మిస్తున్నారు అంటే ఆ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది అన్న నమ్మకం ప్రేక్షకుల్లో ఉంటుంది. ఇక మెగా బ్రదర్ నాగబాబు విషయానికి వస్తే.. నటుడిగా సినిమాలు చేస్తూనే జనసేన పార్టీ కార్యక్రమాలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా అల్లు అరవింద్ నాగబాబుకు ఓ లేఖను రాశారు. ఆ లెటర్ ను మెగా బ్రదర్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఇంతకీ ఆ లెటర్ లో ఏముంది అంటే?
రెండు రోజుల క్రితం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో AAA సినిమాస్ ను ప్రారంభించారు. ఏషియన్ మూవీస్ పార్ట్ నర్ షిప్ తో అల్లు అర్జున్ ఈ మల్టీప్లెక్స్ ను నిర్మించారు. తాజాగా ఈ మల్టీప్లెక్స్ ను అల్లు అర్జున్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున AAA దగ్గర సందడి చేశారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరు కాలేదు. దాంతో అల్లు అరవింద్ చొరవ తీసుకుని మెగా బ్రదర్ నాగబాబుకు ఓ లేఖను రాశారు. ఆ లెటర్ ను నాగబాబు తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. ఇంతకీ ఆ లెటర్ లో ఏముందంటే?
AAA మల్టీప్లెక్స్ ఓపెనింగ్ కు మీరు రాలేదు. ఒక్కసారి వచ్చి ఆదిపురుష్ గానీ లేదా ఏదైనా సినిమా చూసి ఎక్స్ పీరియన్స్ చేయాల్సిందిగా కోరుతున్నాను అంటూ అల్లు అరవింద్ ఆ లేఖలో పేర్కొన్నారు. తాజాగా ఆ లేఖ ను తన సోషల్ మీడియాలో షేర్ చేసి..”మీరు నూతనంగా ప్రారంభించిన AAA సినిమాస్ కు ఇన్విటేషన్ పంపినందుకు థ్యాంక్యూ. మీకు, మా అల్లు అర్జున్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తప్పకుండా మీ థియేటర్ కు వచ్చి సినిమా చూస్తాను. మీరు సృష్టించిన వాతావరణాన్ని ఎక్స్ పీరియన్స్ చేస్తానని మాటిస్తున్నాను” అంటూ రాసుకొచ్చారు నాగబాబు. ఇక నాగబాబు ఓ వైపు జనసేన పార్టీ కార్యక్రమాలు, మరోవైపు వరుణ్ తేజ్ పెళ్లి పనులతో బిజీగా ఉండి AAA సినిమాస్ ఓపెనింగ్ కు రాలేకపోయారు.