iDreamPost
android-app
ios-app

నా ఫస్ట్‌లన్నీ ఫ్లాపులే..సెకండ్లే హిట్లు: వక్కంతం వంశీ

వక్కంతం వంశీ రైటర్ నుండి డైరెక్టర్ స్టాయికి ఎదిగాడు. అల్లు అర్జున్‌ మూవీ నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియాతో దర్శకుడిగా మారాడు. ఇప్పుడు నితిన్‌తో ఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్ తెరకెక్కించాడు. డిసెంబర్ 8న ఈ మూవీ విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు వంశీ.

వక్కంతం వంశీ రైటర్ నుండి డైరెక్టర్ స్టాయికి ఎదిగాడు. అల్లు అర్జున్‌ మూవీ నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియాతో దర్శకుడిగా మారాడు. ఇప్పుడు నితిన్‌తో ఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్ తెరకెక్కించాడు. డిసెంబర్ 8న ఈ మూవీ విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు వంశీ.

నా ఫస్ట్‌లన్నీ ఫ్లాపులే..సెకండ్లే హిట్లు: వక్కంతం వంశీ

ఇటీవల ఐ డ్రీమ్ కిచ్చిన ఇంటర్వ్యూలో దర్శక రచయిత వక్కంతం వంశీ తన జర్నీలో హిట్స్ అండ్ ఫ్లాప్స్ గురించి ప్రస్తావించాడు. జూనియర్ ఎన్టీ ఆర్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన తన తొలి కథ అశోక్ ఫ్లాప్ అయిందని చెబుతూ, రెండవ సినిమా కిక్ మాత్రం హిట్ అయి తనకి రచయితగా మంచి గుర్తింపుని తెచ్చిందని వివరించాడు. అలాగే అల్లు అర్జున్ హీరోగా తను ఫస్ట్ డైరెక్ట్ చేసిన సినిమా నా పేరు సూర్య..ఇంటి పేరు ఇండియా ఫ్లాప్ అయిందని, ఇప్పుడు 8వ తేదీన నితిన్ హీరోగా తన డైరెక్షన్లో రూపొందిన ఎఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్హిట్ అవుతుందని ఘంటా పథంగా చెబుతున్నాడు.

మొదటి సినిమా నాపేరు సూర్య టైంలో తనూ, అల్లు అర్జున్ ఆ కథని మనస్ఫూర్తిగా నమ్మి చేశామని, అంతకు ముందే ఎంటర్ టైన్మెంట్ సినిమా రేసుగుర్రం పెద్ద హిట్ కావడంతో తన తదుపరి సినిమా పూర్తిగా డిఫరెంట్ గా ఉండాలని, ఉంటే బావుంటుందని అల్లు అర్జున్ మనసారా నమ్మి, తను చెప్పిన కథని కూడా పూర్తి రేంజ్ బాగా ఎంజాయ్ చేసి మరీ చేశాడని, కానీ రిజల్ట్ మాత్రం మిస్ అయిందని వంశీ గుర్తు చేసుకున్నాడు. అల్లు అర్జున్ చాలా కమిట్మెంట్ ఉన్న హీరోగా వంశీ చెప్పుకొచ్చాడు. నా పేరు సూర్యలో పాత్రకి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకుని, చాలా కష్టపడి చేశాడని, అది అర్జున్ సిగ్నేచర్ అని అభినందించాడు. అంతే డెడికేషన్, కమిట్ మెంట్ తోనే పుష్ఫ కూడా చేసి, తన గట్స్ అండ్ కెపాసిటీని నిరూపించుకున్నాడని అన్నాడు. అటువంటి స్ట్రాంగ్ హీరోకి నేషనల్ అవార్డ్ రావడం తనకేమీ పెద్ద వింతేమి కాదని, కానీ తనకి గొప్ప ఆనందాన్ని ఇచ్చిందని వంశీ అన్నాడు.

ఇప్పుడు విడుదలవుతున్న నితిన్ సినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్ విషయంలో కథ గురించి చాలా తాపత్రయపడవలసి వచ్చిందని, హీరో నితిన్ తో సినిమా చేస్తున్నామని ఫిక్స్ అయ్యాకనే కథ గురించి ఆలోచించడం మొదలుపెట్టానని వంశీ చెప్పాడు. ‘’ఎన్నాళ్ళయినా కథ ఐడియా రాలేదు. నితిన్ ఫోన్ చేసేవాడు ఏదైనా థాట్ వచ్చిందా అని, చివరికి నితిన్ ఫోన్ ఎత్తడానికే భయమేసింది. కానీ ఒక రోజు సడన్గా వచ్చింది హీరో జూనియర్ ఆర్డిస్టు అయితే ఎలా ఉంటుందీ అని. వెంటనే నితిన్ కి ఫోన్ చేశాను. అప్పుడు నితిన్ తిరుపతిలో ఉన్నాడు. రెండ్రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చాక కల్సి హీరో జూనియర్ ఆర్డిస్టు అని జస్ట్ ఒక్క మాట అన్నాను. వెంటనే ఓకే చేశాడు నితిన్. అక్కడ నుంచి దాదాపు ఏడాది టైం పట్టింది కథ పూర్తిగా తయారవడానికి. కొత్తగా ఉంటుంది సినిమా మొదట్నుంచీ కొసవరకూ. నితిన్ బ్రహ్మాండంగా చేశాడు. మీరే చూస్తారుగా’’ అన్నాడు వక్కంతం వంశీ.

 

    నాగేంద్ర కుమార్