iDreamPost
android-app
ios-app

Balakrishna: నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు అందరికీ ఆహ్వానం: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్

  • Published Aug 30, 2024 | 9:21 PM Updated Updated Aug 31, 2024 | 12:44 PM

Nandamuri Balakrishna Golden Jubilee Celebrations: నందమూరి బాలకృష్ణ 50 వసంతాల ఫంక్షన్ ను గ్రాండ్ గా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది తెలుగు ఫిల్మ్ ఛాంబర్. ఈ వేడుకకు అందరూ ఆహ్వానితులే అంటూ తాజాగా ఆహ్వానించింది తెలుగు చిత్ర పరిశ్రమ.

Nandamuri Balakrishna Golden Jubilee Celebrations: నందమూరి బాలకృష్ణ 50 వసంతాల ఫంక్షన్ ను గ్రాండ్ గా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది తెలుగు ఫిల్మ్ ఛాంబర్. ఈ వేడుకకు అందరూ ఆహ్వానితులే అంటూ తాజాగా ఆహ్వానించింది తెలుగు చిత్ర పరిశ్రమ.

  • Published Aug 30, 2024 | 9:21 PMUpdated Aug 31, 2024 | 12:44 PM
Balakrishna: నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు అందరికీ ఆహ్వానం: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్

నందమూరి బాలకృష్ణ ఆగస్ట్ 30తో ఇండస్ట్రీలోకి వచ్చి 50 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు చలన చిత్ర పరిశ్రమ బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో ఈ కార్యక్రమాన్ని అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. ఎంతో మంది అతిరథమహారథులు పాల్గొనబోతున్నారు. సాయి ప్రియా కన్‌స్ట్రక్షన్స్ మెయిన్ స్పాన్సర్‌గా సుచిర్ ఇండియా, వేగా జ్యూవెల్లర్స్, KLM షాపింగ్ మాల్, శ్రేయాస్ మీడియా కలిసి గ్రాండ్ గా ఈ వేడుకను నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమందికి ఆహ్వానాలు అందలేదని వస్తున్న వార్తలపై తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది.

నందమూరి బాలకృష్ణ ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనుంది. ఇక ఈ వేడుకలకు సంబంధించి ఇప్పటికే అన్ని సౌత్ ఇండియా సినీ పెద్దలకు, దేశ వ్యాప్తంగా ఉన్న అతిరథమహారథులకు ఆహ్వానాలను ఫిలిం ఛాంబర్ అందించింది. అయితే కొందరికి ఆహ్వానాలు అందలేదన్న వార్తలు వచ్చాయి. ఈ న్యూస్ పై తాజాగా స్పందించిన ఫిల్మ్ ఛాంబర్ ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చింది. ఈ సమావేశంలో ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ..”బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలను తెలుగు సినీ పరిశ్రమలోని అన్ని శాఖలు కలిసి నిర్వహిస్తున్నాయి. ఇక ఈ వేడుకకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పలువురు ప్రముఖులు హాజరుకాబోతున్నారు. ఇతర రాష్ట్రాల సినీ పరిశ్రమకు చెందిన స్టార్స్ కూడా ఈ వేడుకకు రాబోతున్నారు. అయితే కొంత మందికి ఆహ్వానాలు అందలేదని ఫిర్యాదులు అందాయి. అన్ని యూనియన్ల సభ్యులకు పీడీఎఫ్ రూపంలో ఆహ్వానాలు పంపాము. ఇన్విటేషన్ ఎవరికైనా రాకపోతే.. తెలుగు ఇండస్ట్రీ మన కుటుంబం అని భావించి ప్రతీ ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. ఇదే మా వ్యక్తిగత ఆహ్వానం” అని చెప్పుకొచ్చారు.

స్పాన్సర్, సుచిర్ ఇండియా కిరణ్ మాట్లాడుతూ..‘‘బాలకృష్ణ 50 ఏళ్ల వేడుకలో భాగం కావడం మా అదృష్టం. ఒక చారిత్రాత్మక ఈవెంట్‌లా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. మంచి వ్యక్తి, మంచి నటుడు, అజాత శత్రువు అయిన బాలకృష్ణకు ఇలాంటి సన్మానం చేయడం నిజంగా గొప్ప విషయం. ఈ వేడుకలో అందరూ పాల్గొనాలి’’ అని ఆయన ఆహ్వానించారు. ఇక ఈ కార్యక్రమంలో KLM ఫ్యాషన్ మాల్ అధినేత కళ్యాణ్ మాట్లాడుతూ..‘‘బాలకృష్ణ సినిమా పరిశ్రమలోకి వచ్చి 50 ఏళ్లు పూర్తి అవుతోంది. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని అన్ని శాఖలు కలిసి ఇలాంటి కార్యక్రమం చేయడం ఇది మొదటిసారి. అలాంటి ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగాలని కోరుకుంటున్నా.’’ అని అన్నారు. ఇక ఈ ప్రెస్ మీట్ లో కేఎల్ఎమ్ కళ్యాణ్, అనుపమ్ రెడ్డి, చదలవాడ శ్రీనివాసరావు, సుచిర్ ఇండియా కిరణ్, మాదాల రవి, సి కళ్యాణ్, భరత్ భూషణ్, దామోదర్ ప్రసాద్, ప్రసన్న కుమార్, శివ బాలాజీ, పరుచూరి గోపాలకృష్ణ, అశోక్ కుమార్, మాదవపెద్ది సురేష్, సుబ్బారెడ్డి, అనిల్ కుమార్ వల్లభనేని, బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomfixbetfixbetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş