iDreamPost
android-app
ios-app

ఆలియా గొప్ప మనసు.. వైరల్‌గా మారిన వీడియో!

  • Published Jul 15, 2023 | 2:06 PM Updated Updated Jul 15, 2023 | 2:06 PM
  • Published Jul 15, 2023 | 2:06 PMUpdated Jul 15, 2023 | 2:06 PM
ఆలియా గొప్ప మనసు.. వైరల్‌గా మారిన వీడియో!

ఆలియా భట్.. ఈ పేరు తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. చాలా తక్కువ సమయంలో.. తక్కువ సినిమాలతో ఈమె దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆలియా బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా సూపర్‌ క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో సీతగా నటించి తెలుగు వాళ్ళ మనసులు దోచుకున్నారు. ఇప్పుడు హాలీవుడ్‌లోనూ తన హవా కొనసాగిస్తున్నారు. “హార్ట్ అఫ్ స్టోన్” అనే మూవీతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశారు. ఈ సినిమా ఆగష్టు 11న అభిమానుల ముందుకి రాబోతోంది.

ఇక, అసలు విషయానికి వస్తే.. ఆలియా చేసిన ఓ పని అందరి దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తోం‍ది. ఆమె మంచితనానికి సోషల్‌ మీడియా మొత్తం సలామ్‌ చేస్తోంది. అంతలా ఆమె ఏం చేసిందని అనుకుంటున్నారా?.. ఆలియా తాజాగా, ఓ రెస్టారెంట్‌కు వెళ్లింది. రెస్టారెంట్‌నుంచి బయటకు వస్తుండగా.. మీడియా వాళ్ళు ఫోటోలు, వీడియోల కోసం ఆమె చుట్టూ చేరి తెగ హడావిడి చేశారు. ఈ నేపథ్యంలోనే ఓ జర్నలిస్ట్‌ చెప్పు ఆమె కారు దగ్గర పడిపోయింది. అది గమనించిన అలియా ఆ చెప్పును తన చేతితో పక్కకు తీసింది.

అంతటితో ఆగకుండా చెప్పును ఆ జర్నలిస్ట్‌ కాలి దగ్గరకు తీసుకెళ్లి పెట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఆలియా చేసిన పనికి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ స్టార్‌ హీరోయిన్‌ అయి ఉండి.. మీరలా చెప్పు పట్టుకోవటం చాలా గ్రేట్‌’’.. ‘‘ మీలాంటి హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉంటారు’’.. ‘‘ మీ మంచి మనసుకు మా జోహార్లు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఆలియా చేసిన ఈ మంచి పని మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియచేయండి. 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss