iDreamPost
android-app
ios-app

RRR సీత.. రియల్ సీత పాత్రకు నో అంటోందట!

  • Author ajaykrishna Updated - 03:04 PM, Thu - 24 August 23
  • Author ajaykrishna Updated - 03:04 PM, Thu - 24 August 23
RRR సీత.. రియల్ సీత పాత్రకు నో అంటోందట!

ఇతిహాస గాథలకు సంబంధించిన క్యారెక్టర్స్ నటీనటులకు అరుదుగా లభిస్తుంటాయి. వాటిని వచ్చిరాగానే ఓకే చేయకుండా వదులుకుంటే తర్వాత సినిమా ఫలితం బట్టి.. ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆర్ఆర్ఆర్ సీత.. అలియా భట్ గురించి అందరు ఇలాగే మాట్లాడుకుంటున్నారు. ఈ ఏడాది డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ ఎలా ట్రోల్స్ కి గురైందో తెలిసిందే. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా.. కృతి సనన్ సీతగా నటించారు. సైఫ్ అలీఖాన్ రావణ్ క్యారెక్టర్ పోషించారు. అయితే.. ఈ సినిమాకు ముందునుండి విమర్శలు ఎదురయ్యాయి. చివరికి ఆదిపురుష్ కలెక్షన్స్ పై ఆ ఎఫెక్ట్ కనిపించింది.

ఇక ఆదిపురుష్ సినిమాపై ఎన్నో విమర్శలు, వివాదాలు జరిగినప్పటికి.. బాలీవుడ్ డైరెక్టర్స్ ఇంకా రామాయణం మీద సినిమాలు తీయాలనే ఆలోచన మానుకోవట్లేదు. అయోధ్యలో రామాలయం నిర్మితం అవుతున్న నేపథ్యంలో.. ఆ చారిత్రక ఘట్టాన్ని బేస్ చేసుకొని ఓ పాన్ ఇండియా మూవీ కోసం ప్రణాళిక జరుగుతుంది. ప్రొడ్యూసర్ మధు మంతెన మూడు భాగాలుగా ఈ రామాయణ గాథను తెరకెక్కించాలని భావిస్తున్నారట. ఇందులో శ్రీరాముడుగా రణబీర్ కపూర్.. సీత క్యారెక్టర్ లో అలియా భట్ ని.. రావణుడుగా కేజీఎఫ్ హీరో యష్ ని తీసుకోవాలని నిర్ణయించుకొని వారితో చర్చలు జరుపుతున్నారట.

ఇంతలో అలియా భట్ మేకర్స్ కి షాకిచ్చిందని తెలుస్తుంది. అదేంటంటే.. ఇప్పుడీ రామాయణం నేపథ్యంలో తెరకెక్కనున్న చిత్రంలో తాను సీతగా నటించలేనని చెప్పి.. ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు సమాచారం. అదేంటీ.. ఆమె భర్త రణబీర్ కపూర్ రాముడిగా చేస్తున్నాడుగా.. ఈమెకు ఏమైంది? అని సందేహం రావచ్చు. అందుకు ఓ కారణం వినిపిస్తుంది. ఏంటంటే.. అలియా భట్ ప్రస్తుతం ఓవైపు కూతురుని చూసుకుంటూ.. మరోవైపు ఓకే చేసిన సినిమాలు ఫినిష్ చేయాల్సి ఉంటుంది. అదిగాక ఆమె ఈ ప్రాజెక్ట్ కి సరిపడా డేట్స్ అడ్జెస్ట్ చేయలేక నో చెప్పినట్లు కథనాలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్స్ నితీష్ తివారి, రవి ఉద్యావర్ కూడా అలియాని కన్విన్స్ చేసేందుకు ట్రై చేశారట. కానీ.. అలియా రెడీగా లేదంటూ బాలీవుడ్ వర్గాల టాక్. ఒకవేళ నిజంగా అలియా తప్పుకుంటే.. ఆ క్యారెక్టర్ ఎవరిని వరిస్తుందో చూడాలి. మరి రామాయణం గురించి మరో సినిమా ప్లాన్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişaresbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom