iDreamPost
android-app
ios-app

నన్ను హర్ట్ చేయకండి! ఆ ధైర్యం ఏ హీరో చేయలేడు: అక్షయ్ కుమార్

  • Author ajaykrishna Updated - 09:17 PM, Sun - 8 October 23
  • Author ajaykrishna Updated - 09:17 PM, Sun - 8 October 23
నన్ను హర్ట్ చేయకండి! ఆ ధైర్యం ఏ హీరో చేయలేడు: అక్షయ్ కుమార్

ఇండస్ట్రీలో ఒకప్పుడు సినిమాలు ఎలా ఉన్నాయి మాట్లాడుకునేవారు. కొన్నాళ్ళుగా సినిమా ఎంత వసూల్ చేసింది అని మాట్లాడుకుంటున్నారు. కంటెంట్ తో కాకుండా కలెక్షన్స్ తో పోల్చుకుంటూ సినిమాలను, ఆ సినిమాలు చేస్తున్న హీరోలను విమర్శిస్తున్నారు. ముఖ్యంగా కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఫ్యాన్స్ కూడా హీరోలకు నెగిటివ్ గా కామెంట్స్ చేసే పరిస్థితి నెలకొంది. సినిమాలు అన్నాక బాక్సాఫీస్ వద్ద ఆడతాయి.. పోతాయి. ఆ విషయం పక్కన పెట్టి సినిమాలపై, హీరోలపై కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదు. కొన్నిసార్లు హీరోల విషయంలో హద్దులు దాటి కామెంట్స్ పెడుతుంటారు. తాజాగా అదే పరిస్థితి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కి ఎదురైంది.

బాలీవుడ్ లో స్టార్ అయిన అక్షయ్.. ఏడాదికి మినిమమ్ నాలుగైదు సినిమాలు రిలీజ్ చేస్తుంటాడు. వాటి ఫలితాలు ఎలా ఉన్నా.. తన పని తాను చేసుకుంటూ పోతాడు. ఇప్పటిదాకా అక్షయ్ కుమార్.. ఏ ఒక్క హిట్ పడినా పొంగిపోలేదు. ప్లాప్స్ పడితే కుంగిపోలేదు. అందరు కమర్షియల్ సినిమాలు చేసినా.. అక్షయ్ మాత్రం కొంచం సొసైటీలో మార్పులు తీసుకొచ్చే సినిమాలు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ.. కొన్నాళ్ళుగా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సినిమాలు మాత్రమే ఆడుతున్నాయి. ఇలా సందేశాత్మక, లేదా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసేవి 50-50 ఛాన్సెస్ అన్నట్లుగా ఆడుతున్నాయి. అక్షయ్ తాజాగా ‘మిషన్ రాణిగంజ్’ సినిమా చేశాడు.

ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అక్షయ్ కి ఓ చేదు అనుభవం ఎదురైంది. మీ సినిమాల కలెక్షన్స్ గురించి చెప్పండి? అని అడిగిన ప్రశ్నకు అక్షయ్ కుమార్ హర్ట్ అయ్యాడట. దీంతో అదే విషయంపై స్పందిస్తూ.. బాక్సాఫీస్ దగ్గర నా సినిమాలు ఎంత వసూల్ చేస్తున్నాయని అడిగి నిరుత్సాహపరచకండి. వసూళ్లతో సంబంధం లేకుండా నా సినిమాలు సమాజంపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి అనేది పరిగణలోకి తీసుకోవాలి. కమర్షియల్ కంటెంట్ సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. కానీ.. సమాజంలో మార్పు రావాలని నేను టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్ లాంటి సినిమాలు చేశాను. కమర్షియల్ కాకుండా నేను చేసే సినిమాలు చేయడానికి ఏ హీరో ధైర్యం చేయలేడు. డబ్బుల కోసం నేను ఆలోచించి సినిమాలు చెయ్యట్లేదు’ అని చెప్పేశాడు కిలాడీ. ప్రస్తుతం అక్షయ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి అక్షయ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet