N కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చివేయడంపై స్పందించిన నాగార్జున! ఏమన్నారంటే..

Akkineni Nagarjuna, N Convention, HYDRAA: మదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై సినీ హీరో అక్కినేని నాగార్జున సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం...

Akkineni Nagarjuna, N Convention, HYDRAA: మదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై సినీ హీరో అక్కినేని నాగార్జున సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ఆయన ఏమన్నారో ఇప్పుడు చూద్దాం...

మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై హీరో నాగార్జున స్పందించారు. ఈ రోజు ఉదయం నుంచి.. ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ కూల్చివేత పనులను హైడ్రా చేపట్టిన విషయం తెలిసిందే. భారీ బందోబస్తు నడుమ ఈ కార్యక్రమం చేపట్టింది. అయితే.. ఈ ఎన్‌ కన్వెన్షన్‌ ప్రముక హీరో నాగార్జునది కావడంతో ఉదయం నుంచి ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే.. తాజాగా తనకు సంబంధించిన ఈ ఎన్‌ కన్వెన్షన్‌ను ప్రభుత్వం కూల్చివేయడంపై నాగార్జున స్పందిస్తూ.. ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ కూల్చివేతలు బాధాకరమని నాగానర్జున పేర్కొన్నారు. అలాగే తాము నిబంధనలు ఉల్లంఘించి ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని కూడా స్పష్టం చేశారు. ఈ రోజు ఉదయం కూల్చివేతల గురించి తమకు ముందస్తుగా ఎలాంటి సమాచారం, నోటీసులు కూడా ఇవ్వలేదని తెలిపారు.

Show comments