iDreamPost
android-app
ios-app

Naa Saami Ranga: ఈ సారి పండక్కి.. నా సామిరంగ! ట్రైలర్‌ ఎలా ఉందంటే..?

  • Published Jan 09, 2024 | 4:17 PM Updated Updated Jan 09, 2024 | 4:17 PM

నాగార్జున కొత్త సినిమా నా సామిరంగా ఈ నెల 14న రిలీజ్‌ అవుతుంది. ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మరి ఆ ట్రైలర్‌ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

నాగార్జున కొత్త సినిమా నా సామిరంగా ఈ నెల 14న రిలీజ్‌ అవుతుంది. ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మరి ఆ ట్రైలర్‌ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 09, 2024 | 4:17 PMUpdated Jan 09, 2024 | 4:17 PM
Naa Saami Ranga: ఈ సారి పండక్కి.. నా సామిరంగ! ట్రైలర్‌ ఎలా ఉందంటే..?

సంక్రాంతి బరిలో దూకి సత్తా చాటేందుకు స్టార్లు సిద్ధమవుతున్నారు. సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు గుంటూరు కారంతో, విక్టరీ వెంకటేష్‌ సైంధవతో వస్తుండగా.. కింగ్‌ నాగార్జున ఈ సారి పండక్కి ‘నా సామిరంగ’ అంటున్నాడు. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ నెల 14న నా సామిరంగ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇక ఈ ట్రైలర్‌.. సినిమాపై అంచనాలను పెంచేసేలా ఉంది. సంక్రాంతికి సరైన సినిమాగా కనిపిస్తోంది నా సామిరంగ. అక్కినేని నాగార్జున హీరోగా విజయ్‌ బిన్నీ దర్శకత్వంలో శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మించిన చిత్రంపై అక్కినేని అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.

అయితే.. ట్రైలర్‌ చూస్తుంటే వారి ఆశలు నిజమయ్యేలా ఉన్నాయి.  సంక్రాంతి పండుగ వాతావరణం అంతా సినిమాలో కనిపిస్తోంది. ఎమోషన్స్‌, ఫైట్లు, కామెడీ, యాక్షన్‌, ఎలివేషన్స్‌ ఇలా సినిమాలో అన్ని యాంగిల్స్‌ బాగా కుదిరినట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తుంది. సినిమాకి ముందుకు కామన్‌ ఆడియన్స్‌లో కూడా సినిమా చూడాల్సిందే అనే క్యూరియాసిటీ కలిగేలా ఈ ట్రైలర్‌ను బాగా కట్‌ చేశారు.  ముఖ్యంగా కొలిమిలో మండుతున్న గునపాన్ని నాగార్జున పైకి విసిరితే.. సరిగ్గా ఫేస్‌పైకి వచ్చే సమయానికి నాగార్జున పక్కకి తప్పుకుని బీడీ వెలిగించే షాట్‌ అయితే.. ట్రైటర్‌కే హైలెట్‌గా నిలిచింది. ఇవి మాస్‌ ఆడియన్స్‌తో పాటు ఎలివేషన్స్‌ను ఇష్టపడే వారిని సినిమా థియేటర్స్‌ వైపు ఆకర్షించేలా ఉంది. మరి కిందున్న నా సామిరంగా ట్రైలర్‌ చూసి.. మీకెలా అనిపించిందో  మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss