Somesekhar
అఖిల్ ను సక్సెస్ ట్రాక్ ఎక్కించాలన్న పట్టుదలతో ఉన్నాడు నాగార్జున. ఇలాంటి సమయంలో రంగస్థలం రేంజ్ స్క్రిప్ట్ ఒకటి అఖిల్ దగ్గరకు వచ్చిందని, ఈసారి హిట్ పక్కా అంటూ అక్కినేని ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
అఖిల్ ను సక్సెస్ ట్రాక్ ఎక్కించాలన్న పట్టుదలతో ఉన్నాడు నాగార్జున. ఇలాంటి సమయంలో రంగస్థలం రేంజ్ స్క్రిప్ట్ ఒకటి అఖిల్ దగ్గరకు వచ్చిందని, ఈసారి హిట్ పక్కా అంటూ అక్కినేని ఫ్యాన్స్ సంతోష పడుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Somesekhar
సినిమా ఇండస్ట్రీలో వందల కొద్ది సెంటిమెంట్స్ ఉంటాయి. అయితే ఆ సెంటిమెంట్స్ కొందరికి వర్కౌట్ కావొచ్చు.. మరికొందరికి కాకపోవచ్చు. ఇక తమకు విజయాల్ని కట్టబెట్టిన ఆ సంప్రదాయాల్నే తమ వారసులకు కూడా అన్వయించి.. సక్సెస్ ట్రాక్ ఎక్కించాలని చూస్తున్నారు స్టార్ హీరోలు. అందులో ముందు వరుసలో ఉన్నాడు అక్కినేని నాగార్జున. తన కొడుకు అఖిల్ కు ఓ సక్సెస్ ఇవ్వాలని ఆరాటపడుతున్నాడు. కొడుకు సక్సెస్ అయితే చూడాలనుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అఖిల్ దగ్గరకు రంగస్థలం రేంజ్ లో ఓ స్క్రిప్ట్ వచ్చిందని టాక్. ఈ స్టోరీని వెతికిమరీ నాగార్జున పట్టుకుని అఖిల్ కోసం ఫిక్స్ చేశాడట. మరి ఆ స్టోరీ ఏంటి? ఆ డైరెక్టర్ ఎవరు? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అక్కినేని అఖిల్.. ఓ సాలిడ్ హిట్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాడు. సినిమాల కోసం ప్రాణం పెట్టి పనిచేస్తున్నప్పటికీ.. అనుకున్న ఫలితాలను మాత్రం దక్కించుకోలేకపోతున్నాడు. దీంతో తండ్రి నాగార్జున సైతం కొడుకు కెరీర్ ను సక్సెస్ ట్రాక్ ఎక్కించాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తనకు అచ్చొచ్చిన సెంటిమెంట్ ను అఖిల్ కోసం కంటిన్యూ చేయించడానికి ముమ్మర ప్రయత్నాలు మెుదలుపెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అఖిల్ కోసం తనకు విజయాలు తీసుకొస్తున్న పల్లెటూరి బ్యాక్ డ్రాప్ సెంటిమెంట్ నే తీసుకుంటున్నాడు. నాగ్ సొగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు, నా సామిరంగా లాంటి పల్లెటూరి కథా చిత్రాలతో మంచి విజయాలు సాధించాడు. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో రంగస్థలం రేంజ్ కథను పట్టుకున్నాడట నాగ్. అసలు విషయం ఏంటంటే?
డైరెక్టర్ అబ్బూరి మురళీ కిషోర్ ఇంతకు ముందే ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాతో అభిరుచి గల డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. తన నెక్ట్స్ మూవీ కోసం రంగస్థలం రేంజ్ లో ఓ కథను సిద్ధం చేసుకున్నాడు. ఆ స్టోరీని రవితేజకు వినిపించాడు కూడా. కథ నచ్చడంతో.. మాస్ మహారాజా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే.. ఇటీవల కాలంలో రవితేజ చేసిన సీరియస్ మూవీస్ ఏవీ కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. దాంతో ధమాకా లాంటి ఎంటర్ టైనర్ కోసం వేచి చూస్తూ.. ఈ కథను హోల్డ్ లో పెట్టేశాడు.
అయితే నాగార్జునకు ఈ విషయం ఎలా తెలిసిందో ఏమో కానీ.. డైరెక్టర్ మురళీ కిషోర్ ను పిలిచి, కథ విన్నాడట. అటు నాగ్ కు, ఇటు అఖిల్ కు స్టోరీ నచ్చడంతో మూవీ చేయాలని ఫిక్స్ అయ్యారు. సొంత బ్యానర్ లోనే సినిమా చేయనున్నట్లు, నాగార్జున దగ్గరుండి మరీ ఈ చిత్రాన్ని హిట్ చేసి.. కొడుక్కి కానుకగా ఇవ్వాలన్న పట్టుదలతో ఉన్నాడట. కాగా.. ప్రస్తుతం అఖిల్ యూవీ బ్యానర్ లో ‘ధీర’ మూవీ చేయాల్సి ఉంది. ఆ సినిమా తర్వాత ఇది పట్టాలు ఎక్కుతుందా? లేక.. రెండు సమాంతరంగా షూటింగ్స్ జరుపుకొంటాయా? అన్నది చూడాలి.