iDreamPost
android-app
ios-app

Vishwambhara: ‘కల్కి’ రూట్ లో ‘విశ్వంభర’.. ఫ్యాన్స్ కు పండగే!

  • Published Aug 02, 2024 | 11:37 AM Updated Updated Aug 02, 2024 | 11:37 AM

కల్కి మూవీలో హాలీవుడ్ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇక ఇప్పుడు ఇదే రూట్ లో వెళ్లి సక్సెస్ కొట్టడంతో పాటుగా ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్ ఇవ్వాలని భావిస్తోంది విశ్వంభర టీమ్. ఆ వివరాల్లోకి వెళితే..

కల్కి మూవీలో హాలీవుడ్ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇక ఇప్పుడు ఇదే రూట్ లో వెళ్లి సక్సెస్ కొట్టడంతో పాటుగా ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్ ఇవ్వాలని భావిస్తోంది విశ్వంభర టీమ్. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Aug 02, 2024 | 11:37 AMUpdated Aug 02, 2024 | 11:37 AM
Vishwambhara: ‘కల్కి’ రూట్ లో ‘విశ్వంభర’.. ఫ్యాన్స్ కు పండగే!

‘కల్కి 2898 ఏడీ’ ప్రభాస్-నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. రికార్డు స్థాయిలో వసూళ్లను సాధించి.. బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1100 కోట్ల కలెక్షన్లతో అదరగొట్టింది. హాలీవుడ్ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇక ఇప్పుడు ఇదే రూట్ లో వెళ్లి సక్సెస్ కొట్టడంతో పాటుగా ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్ ఇవ్వబోతోంది విశ్వంభర టీమ్. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాల చిత్రీకరణ పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో వచ్చే సినిమాల్లో సీజీ హడావిడి ఎక్కువైపోయింది. ఇంతకు ముందు మూవీస్ లో భారీ సెట్లు వేసేవారు. కానీ ఇప్పుడు దాన్ని గ్రాఫిక్స్ లో మ్యానేజ్ చేస్తున్నారు. అయితే కొందరు డైరెక్టర్లు మాత్రం భారీ సెట్లకు ప్రియారిటీ ఇస్తూ.. థియేటర్లకు వచ్చే ప్రేక్షకులను నిరుత్సాహపరచడం లేదు. తాజాగా కల్కి మూవీ ఇందుకు నిదర్శనం. కల్కి మూవీలో ఏకంగా 16 సెట్లు వేశారు. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులకు సూపర్ ఐ ఫీస్ట్ ను అందించింది. సీజీ వర్క్ ఉన్నాగానీ.. సినిమా చూస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ కలగకుండా మేకర్స్ జాగ్రత్త పడ్డారు.

ఇక ఇప్పుడు కల్కి రూట్ లోనే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీ వెళ్తోంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీ కోసం డైరెక్టర్ వశిష్ట ఓ కొత్త లోకం సృష్టించాడు. అందులో భాగంగా భారీ సెట్లు వేశాడు. ఇప్పటికే విశ్వంభర కోసం 8 భారీ సెట్లు వేశారని టాక్. మరో 4 సెట్లు కూడా వేయబోతున్నట్లు టాక్. ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ అద్భుతమైన సెట్లు వేస్తున్నారు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఓ సెటప్ ను నిర్మిస్తున్నారు. ఇక ఈ మధ్య కాలంలో కల్కి మూవీ తర్వాత ఇన్ని సెట్లు వేసిన సినిమా విశ్వంభరే అంటున్నారు సినీ పండితులు. దాంతో థియేటర్లలో ప్రేక్షకులకు కన్నుల పండగ ఉండబోతోందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş