iDreamPost
android-app
ios-app

శత్రువులుగా మారిన లవర్స్!.. ఆసక్తి రేకెత్తిస్తున్న డెకాయిట్ టైటిల్ టీజర్!

  • Published Dec 20, 2023 | 8:03 PM Updated Updated Dec 21, 2023 | 1:25 PM

యంగ్ హీరో అడవి శేష్, స్టార్ హీరోయిన్ శృతిహాసన్ జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం డెకాయిట్. తాజాగా చిత్ర యూనిట్ టైటిల్ టీజర్ ను విడుదల చేసింది.

యంగ్ హీరో అడవి శేష్, స్టార్ హీరోయిన్ శృతిహాసన్ జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం డెకాయిట్. తాజాగా చిత్ర యూనిట్ టైటిల్ టీజర్ ను విడుదల చేసింది.

  • Published Dec 20, 2023 | 8:03 PMUpdated Dec 21, 2023 | 1:25 PM
శత్రువులుగా మారిన లవర్స్!.. ఆసక్తి రేకెత్తిస్తున్న డెకాయిట్ టైటిల్ టీజర్!

టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. సినిమాల్లో డిఫరెంట్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నారు. తెలుగులో గూడాచారి, హిట్, మేజర్ సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక తాజాగా అడవి శేష్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం డెకాయిట్. షానిల్ డియో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హీరో అడవి శేష్ కు జంటగా ప్రముఖ హీరోయిన్ శృతిహాసన్ నటిస్తోంది. తాజాగా చిత్ర యూనిట్ డెకాయిట్ కు సంబంధించిన టైటిల్ టీజర్ ను విడుదల చేశారు. డెకాయిట్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

టైటిల్ టీజర్ ప్రారంభంలో రణరంగంగా మారిన ప్రాంతంలో హీరోహీరోయిన్ల మధ్య సంభాషణ ఇంట్రెస్టింగ్ గా ఉంది. తుపాకుల మోతతో, బాంబుల శబ్ధాలతో చెల్లా చెదురుగా తగలబడిన వాహనాలు, పోలీసుల శవాలు చూస్తుంటే సినిమాలో వయలెన్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం శత్రువులుగా మారిన ప్రేమికులు ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలే అని తెలుస్తోంది. ఇద్దరి ప్రేమికుల మధ్య వచ్చే మనస్పర్థల వల్ల వారు బద్ద శత్రువులుగా మారినట్లు డైరెక్టర్ టీజర్ లో చూపించారు. టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తోంది.

టైటిల్ టీజర్ లో ముఖానికి మాస్క ధరించి ఎంట్రీ ఇచ్చిన హీరో అడవి శేష్ ‘జూలియట్… ఎన్ని ఏళ్ళు అయ్యింది మనం కలిసి!’ అని హీరోయిన్ ను ఉద్దేశించి అడుగుతాడు. ఆ సమయంలో ఆయన మెడపై చూస్తే ‘గాడ్ ఈజ్ డెడ్’ అనే టాటూ కనిపించింది. ‘కలిసి కాదు… విడిపోయి’ అని శృతి హాసన్ నుంచి బుదలిచ్చింది! శృతిహాసన్ చీర కట్టుకుని, చేతిలో తుపాకీతో పాదాలకు రక్తం కారుతున్న దృశ్యాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. శత్రువులుగా మారిన ప్రేమికుల కథలో అడివి శేష్, శృతి హాసన్ కనిపించనున్నారని టీజర్‌ చూస్తే తెలుస్తోంది. ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుంది. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. మరి డెకాయిట్ టైటిల్ టీజర్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobet giriş